ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వరుసగా కార్లు కాల్వల్లోకి దూసుకు వెళ్లడం.. ప్రాణాలు గాల్లో కలిసి పోవడం జరుగుతుంది.  కరీంనగర్ లో ఎల్ ఎండీ కాల్వలో పడి పెద్దపల్లి ఎమ్మెల్యే బంధువులు మృతి చెందిన విషయం తెలిసిందే.  నల్లగొండ జిల్లా భువన గిరి వద్ద మరో కారు ఇలాగే కాల్వలోకి దూసుకు వెళ్లి మరణించారు. నల్గొండ జిల్లాలో పీఏ పల్లి మండలం దుంగ్యాలలో ఘోరం జరిగింది. కారు అదుపుతప్పి పీఎంఆర్‌పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. అయితే, బాలుడిని స్థానికులు రక్షించారు.  ఇలా కాల్వల్లోకి దూసుకు వెళ్లడానికి కారణం అత్యంత వేగం.. కంట్రోల్ చేసుకోలేక పోవడం అని పోలీసులు అంటున్నారు. 

 

తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాథపురం వద్ద ఓ కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన బాధితులు నరసాపురం మండలంలోని మచ్చపురి నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా కారు అదుపుతప్పి నరసాపురం కాల్వలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. పోలీసులు, స్థానికుల సాయంతో కారును బయటికి తీశారు.

 

కాగా, వాహనం నడుపుతున్న వ్యక్తి నిద్రలోకి జారుకోవడంతో కారు అదుపుతప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లింది. మృతులు యలమంచిలి మండలం కాజ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం గురించి కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. రెండు రోజుల కిందట గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట వద్ద వాగులోకి కారు దూసుకెళ్లి ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.  గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తాండా వద్ద క్వారీ గుంతలో మిర్చి లారీ బోల్తా పడి ఐదుగురు రైతులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు.  ఈ ప్రమాదాలన్నీ అతివేగం వల్లే చోటుచేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: