ఈ సువిశాల ప్రపంచంలో ఎన్నో ఆచారాలు కాలగర్భంలో కలిసిపోయాయి.. ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది మనుషుల అలవాట్లల్లో, ఆచారాల్లో ఎన్నో మార్పులు జరిగాయి.. కానీ ఇప్పటికి అక్కడక్కడ నివసించే కొన్ని కొన్ని తెగల్లో అసహ్యాన్ని, భయాన్ని కలిగించే కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు.. వీటిని ఈ తెగలవారు ఖచ్చితంగా అమలు చేస్తారు.. ఇలాంటి వింత ఆచారాలను పాటించే వారిని చూస్తే ఇది వెర్రితనమో, పిచ్చో తెలియదు..

 

 

ఇదిగో ఇలాంటి ఆచారాన్ని పాటించే ఒక తెగ గురించి తెలుసుకుంటే. వాటిలో దక్షిణ ఇథియోపియాలోని లేక్ తర్కానా, లోవర్ ఒమో వ్యాలీ ఒకటి. ఇక్కడ ఉన్న సుర్మా అనే జాతిలో.. ముర్సి, సురి, మేకన్ అనే మూడు తెగలు ఉంటాయి. వీరిలో ముర్సి, సురి అనే తెగలు ఒకే రకమైన సంస్కృతిని పాటిస్తాయి. ఇకపోతే ప్రపంచంలో ఆడవారి అందాన్ని పోల్చడంలో ఎన్నో రకాలు ఉన్నాయి.. కానీ ఈ తెగలోని వారు మాత్రం ఆడవారి అందాన్ని లిప్ ప్లేట్‌తో పోలుస్తారట. అదేమంటే ఈ తెగలో నివసించే అమ్మాయిల కోసం ప్రత్యేకంగా మట్టి లేదా చెక్కతో సుమారుగా నాలుగు నుంచి 25 సెంటీ మీటర్ల వరకు ఉండే ప్లేట్లను తయారుచేస్తారట...

 

 

యుక్తవయసుకు వచ్చిన అమ్మాయిల పెదవుల్లో కింద పెదవిని కట్ చేస్తారు. దీనికంటే ముందు కింద వరుసలో ముందు కనిపించే నాలుగు పళ్లను తీసేసిన తరువాత వారి పెదవి మధ్య ఈ ప్లేట్లను పెడతారు. మొదటగా నాలుగు సెంటీమీటర్ల సైజు కలిగి ఉన్న ప్లేటును పెట్టగా, క్రమ క్రమంగా కింద పెదవి విస్తరించేందుకు.. ప్లేటు సైజు పెంచుకుంటూ వెళ్తారట. ఇలా ఎందుకంటే ఇక్కడి అమ్మాయిలకు పెళ్లి చేసే ముందు ఇద్దరి తల్లిదండ్రులు అమ్మాయి పెదవులనే చూస్తారు. ఇక ఇక్కడి సాంప్రదాయం ప్రకారం.. అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి తల్లిదండ్రులు కట్నం కింద పశువులను ఇస్తారు.

 

 

అయితే ఈ కట్నాన్ని ఎలా ఇస్తారంటే.. అమ్మాయి పెదవుల మధ్య ఎంత పెద్ద సైజు ప్లేటు సరిపోతే.. అన్ని ఎక్కువ పశువులు అమ్మాయి తల్లిదండ్రులకు అబ్బాయి కుటుంబం నుంచి కట్నం కింద ఇస్తారట. చిన్న ప్లేటు అయితే 40 పశువులను.. పెద్ద ప్లేటు అయితే 60 పశువులను ఇస్తుంటారు. ఇలా పెద్దప్లేటు అమ్మాయి పెదవుల మధ్య సరిపోయిందంటే.. ఆమెను అదృష్టవంతురాలిలా చూస్తారు. ఇదేం ఆచారమో గానీ వినడానికే వింతగా ఉంది.. ఇకపోతే దొండపండు లాంటి పెదాలను ఇలా బండపెదాల్లా మార్చుకుంటున్న వీరి ఆచారాలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: