రాజకీయాల్లో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఇక ఆ లిమిట్ దాటేసి మరి రాజకీయాలు చేస్తే పిచ్చి పీక్స్‌కు వెళ్లిపోయిందనే చెప్పుకోవాలి. ఆ విషయం గత 9 నెలలుగా ప్రతిపక్ష టీడీపీని చూసే అర్ధమైపోతుంది. జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చి పాలన మొదలుపెట్టగానే, కనీసం సమయం ఇవ్వకుండానే బాబు అండ్ కొ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. అసలు జగన్ ఏ నిర్ణయం తీసుకున్న, ఏ పథకం అమలు చేసిన విమర్శలు చేయడమే మొదటి అజెండాగా పెట్టుకుని ముందుకెళ్లారు.

 

అలాగే పోరాటాలు, ఆందోళనలు కూడా చేశారు. కానీ టీడీపీ వాళ్ళు చేసే పోరాటాలని ప్రజలు పట్టించుకోలేదు. ఇక ఈ క్రమంలోనే జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసమని తీసుకొచ్చిన మూడు రాజధానులని తీసుకొస్తే, దానిపై కూడా టీడీపీ గత రెండు నెలలుగా రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలు మూడు రాజధానులు కావాలని అనుకున్న, టీడీపీ వాళ్ళు మాత్రం అమరావతిలోనే మొత్తం రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తూ, రాజకీయం చేయడం మొదలుపెట్టారు.

 

అటు రాజధాని గ్రామాల రైతులు కూడా బాబు ట్రాప్‌లో పడి, జగన్ న్యాయం చేస్తానని చెప్పిన ఉద్యమం చేస్తూనే ఉన్నారు. ఇక టీడీపీ కూడా ఉద్యమాన్ని నడిపిస్తూ, జగన్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఆ ప్రయత్నాలు ఏమి సఫలం కావడం లేదు. మొదట రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. చంద్రబాబు జోలెపట్టుకుని రోడ్ల మీదకు వెళ్లారు. ఇక రాష్ట్ర గవర్నర్‌ని కలిసారు. ఢిల్లీకి వెళ్ళి, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రులని కలిశారు. కానీ ఇవేమీ వర్కౌట్ కాలేదు. కేంద్రం కూడా రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేమని చెప్పేసింది. అటు మండలిలో అడ్డుకుంటే, జగన్ మండలినే రద్దుకు తీర్మానం చేసేశారు. 

 

కాకపోతే హైకోర్టులో వేసిన కేసు మాత్రం అలా ఉంది. అయితే ఈ క్రమంలోనే అమరావతి గురించి, ఓ టీడీపీ ఎన్‌ఆర్‌ఐ అంతర్జాతీయ న్యాయస్ధానంలో కేసు వేసి బాగానే హడావిడి చేశారు. అసలు అక్కడ కేసు వేయడం వల్ల పావలా ఉపయోగం లేదు. ఏదో మీడియాలో ప్రచార ఆర్భాటం తప్ప. ఏదేమైనా టీడీపీకి పిచ్చి పీక్స్‌కు వెళ్ళిపోయి ఇలాంటి పనులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అధికారం కోల్పోవడంతో బాబు ఖాళీగా ఉండలేక పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: