చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే చైనాలో అధికారిక లెక్కల ప్రకారమే కరోనా వైరస్ సోకి నాలుగు వేల మందికి పైగా చనిపోయారు. ఇక ఈ వ్యాధితో బాధపడుతున్న వారు లక్ష లక్ష దాటారు. ఇక భారతదేశంలోనూ ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య మూడు దాటిందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నూ కొందరికి కరోనా వైరస్ సోకింది అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే మన దేశంలో కూడా కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.



భారత దేశంలో కూడా  కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది. క‌రోనా వైర‌స్ రోజు రోజుకు ఎక్కువ అవుతోన్న నేప‌థ్యంలో వీళ్ల‌కు మెడిస‌న్స్ కొర‌త లేకుండా ఉండేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇందులో భాగంగా 26 యాక్టివ్‌ ఫార్మా ఇంగ్రీడియంట్స్‌ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు విధించింది. పారాసెటమల్, విటమిన్‌ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి.



ఇక పై  పైన పేర్కొన్న మందుల‌ను విదేశాల‌కు ఎగుమ‌తి చేయాలంటే ఖ‌చ్చితంగా డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మ‌ళ్లీ క‌రోనా క‌ల‌క‌లం త‌గ్గేవ‌ర‌కు ఈ ఆంక్ష‌లు కొన‌సాగుతాయి. ఔషధాల తయారీలో కీలకమైన ఏపీఐల కోసం భారత్‌ ఎక్కువగా చైనాపైనే ఆధార‌ప‌డుతూ వ‌స్తోంది. ఇక ఇప్పుడు చైనాలోనే క‌రోనా వైర‌స్ అల్ల‌క‌ల్లోలం క్రియేట్ చేస్తుండ‌డంతో మ‌న‌కు అక్క‌డ నుంచి వ‌చ్చే దిగుమ‌తులు ఆగాయి. ఈ నేప‌థ్యంలో మ‌న దేశంలో మందుల కొర‌త లేకుండా ఉండేందుకు దేశీయంగా ఏపీఐలు, ఔషధాల కొరత తలెత్తకుండా కేంద్రం తాజా చర్యలు తీసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: