వినడానికి ఆశ్చర్యంగా వున్నా ఇది అక్షరాలా నిజం. ఇరాన్ లో జరిగిన అందరిని అవాక్కయేలా చేస్తోంది. సాధారణంగా సత్ప్రవర్తన మీద ఖైదీలను రిలీజ్ చేయడం మనం చూస్తుంటాం. కానీ, ఇరాన్‌లో మాత్రం 54000 మంది ఖైదీలను కరోనా వైరస్ కారణంగా తాత్కాలికంగా వదిలేసింది అక్కడి ప్రభుత్వం. గుంపులుగా ఉండే చోట... వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇరాన్ డాక్టర్లు హెచ్చరించడం వలన తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 

IHG

 

ఇక వారిని విడుదల చేసే ముందు వాళ్లకు పరీక్షలు జరిపించారట. కొవిడ్ 19 వైరస్ నెగెటివ్ అని వచ్చిన వారిని మాత్రమే వదిలేస్తూ... బెయిల్ ఇచ్చినట్లుగా సదరు జైలు అధికారులు రాసుకున్నారు. ఈ ఖైదీలలో కరడుగట్టిన నేరస్తులను, ఐదేళ్లకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన ఖైదీలను మాత్రం వదల లేదని వినికిడి. బ్రిటన్‌కి చెందిన చారిటీ వర్కర్ నజానిన్ జఘారీ-రాట్‌క్లిఫ్ కూడా త్వరలో రిలీజయ్యే అవకాశాలున్నాయని బ్రిటీష్ ఎంపీ అభిప్రాయపడ్డారు. 

 

నజానిన్ భర్త మటుకు, తన భార్యకు కరోనా వైరస్ సోకి ఉంటుందనీ, టెస్ట్ చెయ్యమంటుంటే... జైలు అధికారులు చెయ్యట్లేదని ఆరోపణలు చేసాడు. నజానిన్‌ను 2016లో సైనిక రహస్యాల్ని తెలుసుకుంటున్నారనే కారణంతో అరెస్టు చేశారు. బ్రిటన్ ప్రభుత్వం ఆమె ఏ తప్పూ చెయ్యలేదని వాదించింది. ఇరాన్ మాత్రం ఆమెకు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 72 దేశాల్లో కరోనా వైరస్ ఉంది.

 

IHG

 

కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న పది దేశాలు వరుసగా... చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, సింగపూర్, అమెరికాగా నమోదయ్యాయి. ఇరాన్‌లో రెండు వారాల్లో 77 మంది చనిపోయారు. మంగళవారం కొత్తగా 835 మందికి ఈ వైరస్ సోకినట్లు తేలింది. ఇరాన్‌లో చాలా మంది సీనియర్ అధికారులకు కూడా ఇది ప్రబలినట్లు వినికిడి. పార్లమెంట్‌లోని 290 మంది ఎంపీల్లో 23 మందికి కరోనా సోకినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: