ప్రస్తుతం ఎవరి నోట విన్నా.. కరోనా వైరస్ గురించే.. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అంటే ఇప్పుడు ప్రజలు వణికిపోతున్నారు.  చైనాలోని కుహాన్ లో మొదలైన ఈ భయంకరమైన వైరస్ క్రమ క్రమంగా ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది.  గతంలో కరోనా వైరస్‌ బారినపడి డాక్టర్‌ లీ వెన్‌లియాంగ్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా వుహాన్‌ నగరంలో మరో వైద్యుడు చనిపోయారు.  కరోనా ఎఫెక్ట్ తో వైద్యులే ఇలా చనిపోతుంటే సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక కరోనా నియంత్రణ కోసం వైద్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తూ.. ప్రత్యేక మాస్క్‌ల ద్వారా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు.

 

మన దేశంలో ప్రస్తుతానికి ఈ వ్యాధి ప్రబలుతుందని వదంతులు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కరోనా బాధితులకు వైద్య పరీక్షలు అందిస్తున్నారు. ఢిల్లీలో కూడా కేసు నమోదైంది.. ఇప్పుడు జైపూర్ లో కరోనా బాధితులు ఉన్నట్లు సమాచారం. అయితే కరోనాకు ఇప్పటి వరకు మందు కనిపెట్టలేదు.. కానీ దాన్ని అరికట్టడం మన చేతుల్లో ఉందని అంటున్నారు వైద్యులు.    ముఖ్యంగా కరోనా అనేది వైరస్ కావడం వల్ల గాల్లోనే ఎక్కువ వ్యాప్తి చెందుతుంది.  దీన్ని అరికట్టాలంటే ముఖ్యంగా మాస్క్ ధరించాలి.  చేతులు ఎవరికి పడితే వారికి ఇస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు.  బయట నుంచి ఇంటికి వెళ్తే కాళ్లూ చేతులు శుభ్రం చేసుకోవాలి. 


వ్యాధి లక్షణాలు :  గొంతు మంటగా ఉంటుంది. తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి, ముక్కు వెంట నీరు కారినట్లు అనిపించడం.. నీరసంగా మారిపోవడం.. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది.  ఇలా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు : ప్రస్తుతం ఏ వైరస్ అయినా సోకితే వెంటనే మందులు కనిపెడుతున్నారు.. కానీ ఇప్పటి వరకు కరోనాకు ఏ మందు కనిపెట్టలేక పోయారు.  ఇతరుల కళ్లు, ముక్కు, నోటిని మీ చేతులతో టచ్ చేయవద్దు. రోగులకు దగ్గరగా ఎక్కువగా కూర్చోవడం.. మాట్లాడం చేయొద్దు.  రెగ్యులర్‌గా సబ్బు, నీటితో చేతులు కడుక్కోవాలి.  ఈ వైరస్ ఎవరికైనా వచ్చినట్లు తెలిస్తే... డాక్టర్లు ఆ వ్యక్తిని ప్రత్యేక గదిలో ఉంచేస్తారు. క్కువ నీళ్లు తాగాలి. ఒకటీ రెండు రోజుల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నవారికి తగ్గకుండా తప్పకుండా వైద్యుల సూచనలు పాటించాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: