మధ్యప్రదేశ్ లో కమలనాధ్ ఆధ్వర్యంలోని కమలనాధ్ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానం మొదలైంది.  అధికారపక్షానికి చెందిన ఎనిమిది మంది ఎంఎల్ఏలను ప్రతిపక్ష బిజెపి ఎత్తుకెళ్ళిందని కమలనాధ్ స్వయంగా ఆరోపించటం సంచలనంగా మారంది. తమకు చెందిన ఎంఎల్ఏలతో బిజెపి క్యాంపు నడిపిందని ముఖ్యమంత్రే చెబితే ఏమిటర్ధం ?

 

నిజానికి మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం తక్కువ మెజారిటితోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. అధికార-ప్రతిపక్షాల మధ్య ఉన్న తేడా చాలా చాలా తక్కువనే చెప్పాలి.  ప్రతిపక్షానికన్నా సుమారుగా ఉంటే ఓ ఐదుగురు ఎంఎల్ఏలకన్నా తేడా ఉండదు. 230 ఎంఎల్ఏలున్న అసెంబ్లీలో కాంగ్రెస్+ బలం 114 అయితే, ప్రతిపక్ష కమలం పార్టీ బలం 109 మాత్రమే. అంటే అధికార-ప్రతిపక్షాల మధ్య బలంలో తేడా కేవలం ఐదుగురు ఎంఎల్ఏలు మాత్రమే. కాకపోతే ఓ ఏడుగురు ఎంఎల్ఏలు ఇతరుల కోటాలో గెలిచారు లేండి.

 

ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజే తెలిసిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం కంటిన్యు అయ్యే అవకాశం లేదని. ఎందుకంటే అసలు మెజారిటినే చాలా తక్కువ. దానికి తోడు పార్టీలోనే  కమలనాధ్ పై వ్యతిరేకత కూడా బాగానే ఉంది. సరే ప్రస్తుత విషయానికి వస్తే అధికారపక్షానికి చెందిన 8మంది ఎంఎల్ఏలు గుర్ గ్రామ్ లోని ఓ హోటల్లో కనిపించారు. ఎప్పుడైతే 8 మంది ఎంఎల్ఏలు ఒకే హోటల్లో కనిపించారో వెంటనే కమల్ అప్రమత్తమయ్యారు. తమ ఎంఎల్ఏలను బిజెపి ఓ హోటల్లో బంధించినట్లు ఆరోపణలు మొదలుపెట్టేశారు.

 

అయితే 8మందిలో ఆరుగురిని కాంగ్రెస్ పార్టీ విడిపించుకుని వెళ్ళిందనే ప్రచారం కూడా మొదలైంది. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బిజెపి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సిఎంతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలందరూ ఒకటే గోల మొదలుపెట్టేశారు. దాంతో బిజెపి ప్రయత్నాలు కాస్త బెడిసికొట్టినట్లే కనిపిస్తోంది. ఒకటి మాత్రం నిజం. కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న ఏకైక కారణంతోనే వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను  బిజెపి ఇబ్బంది పెడుతోంది. మరి మధ్యప్రదేశ్ లో మొదలైన ప్రయత్నాలు ఏ మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: