’జాతీయస్ధాయిలో ఏ పాత్ర పోషించాలో తెలియని అయోమయస్ధితిలో ఉన్నాం’ … ఇది తాజాగా వైసిపి ఎంపిలను ఉద్దేశించి పచ్చమీడియా అల్లేసిన తాజా కథనం. ఈ కథనం చూస్తుంటే పచ్చమీడియా పైత్యం పీక్స్ కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఢిల్లీ అల్లర్లపై పార్లమెంటులో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే  తమ వైఖరిని మాత్రం తాము చెప్పలేకపోతున్నట్లు వైసిపి ఎంపిలు పచ్చమీడియాతో వాపోయారట.

 

ఇంతకీ విషయం ఏమిటంటే ప్రధానమంత్రి నరేంద్రమోడి, హోంశాఖ మంత్రి అమిత్ షాని తమ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత తాము అధికార పక్షంలో ఉన్నామో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నామో కూడా తమకు తెలీటం లేదని పాపం వైసిపి ఎంపిలు పచ్చమీడియాతో చెప్పుకుని బాధపడిపోయారట. అంతగా అయోమయంలో పడిపోవటానికి కారణం ఏమిటో మాత్రం మీడియా చెప్పలేదు. ఎందుకంటే జగన్ ఎన్డీఏలో భాగస్వామి ఏమీ కాదన్న విషయం అందరికీ తెలిసిందే.

 

ఎన్డీఏలోను లేక యూపిఏలోను లేని పార్టీలు చాలానే ఉన్నాయి. అవన్నీ అవసరార్ధం ఎన్డీఏకి మద్దతుగా ఉండటమో లేకపోతే తటస్తంగా ఉండటమో చేస్తున్నాయి.  మరీ కాదంటే కొన్ని అంశాలపై కేంద్రప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం కూడా తెలిసిందే. న్యూట్రల్ గా ఉన్న పార్టీల్లో వైసిపి కూడా ఒకటి. సిఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతిచ్చిన జగన్ ఎన్ఆర్సీ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం ఎంపిలకు తెలీదా ?

 

సందిగ్దంలో ఉండటం కన్నా ఎన్డీఏలో చేరితే మంచిదని కొందరు చేరితే రాజకీయంగా నష్టమని మరికొందరు ఎంపిలు భావిస్తున్నారని పచ్చమీడియా చెప్పుకొచ్చింది. ఇదంతా ఈ మీడియా పైత్యమే కానీ ఎంపిలది కాదన్న విషయం తెలిసిపోతోంది. ఎందుకంటే పార్టీ తరపున తీసుకోవాల్సిన స్టాండ్ ను జగన్ తీసుకుంటాడు. మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారంతే. ఇంతోటి దానికి అయోమయం ఏముంది ? ఏదో ఫలానా ఎంపి చెప్పాడని, ఈ యువ ఎంపి అయోమయంలో ఉన్నాడని, ఆ సీనియర్ ఎంపి అసంతృప్తితో ఉన్నాడంటూ నాలుగు గోడల మధ్య కూర్చుని అల్లేసే స్టోరీలకు విశ్వసనీయత ఏముంటుంది ? తన రాతలను ఎవరు నమ్మటం లేదని తెలిసినా రాస్తున్నారు కాబట్టే పచ్చమీడియా అంటున్నది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: