ఐటీ అధికారులు ఇటీవల దక్షిణాదిలో ప్రముఖుల ఇళ్లపై వరుసబెట్టి దాడులు చేయడం జరిగింది. ముందుగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ప్రముఖ యాంకర్ ల పై అదేవిధంగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ల ఇళ్లపై మరియు కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగాయి. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకులపై మరి కొంతమంది ప్రముఖ రాజకీయ నేతల ఇళ్లపై వాళ్లకు సంబంధించి పనిచేసిన సిబ్బందిపై ఐటీ దాడులు జరగడం జరిగింది. ఈ నేపధ్యంలో తాజాగా నారాయణ మరియు చైతన్య విద్యాసంస్థలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. దీనిలో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ నగరంలో బెంజ్ సర్కిల్ వద్ద ఉండే నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజీ లో క్యాంపస్ లపై ఐటీ అధికారులు సోదాలు చేశారు.

 

ఈరోజు ఉదయం 8 గంటలకు అధికారులు సోదాలు ప్రారంభించగా ఇంకా దాడులు కొనసాగుతున్నాయి. కాలేజీలో ప్రతి అణువణువు తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా కాలేజీ కార్యాలయంలో ఉన్న ప్రతి రికార్డును చాలా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో ఐటీ అధికారులు కొన్ని ప్రత్యేక కారణాలు, అనుమానాలతో ఈ దాడులు చేస్తున్నట్లు తెలిసింది.

 

ఐటీ తనిఖీల్లో కొన్ని ప్రత్యేక పత్రాలు, రికార్డుల్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే... దాడుల వెనక రాజకీయ కోణం ఉండి ఉండొచ్చని కొంత మంది టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై ఏమాత్రం ఐటీ అధికారులు స్పందించలేదు. ఇదే తరుణంలో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ సమీపంలో ఉన్న శ్రీచైతన్య కార్పొరేట్‌ కాలేజీలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్టులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద మొట్ట మొదటి రోజు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో ఐటీ దాడులు జరగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: