ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. ఒక్కరి నుంచి వేగంగా సోకే ఈ వైరస్‌ వ్యాప్తికి ఆది ఎక్కడ అన్నవిషయంపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఒక్క దేవంలోకి ఒక్కో వ్యక్తి మూలంగా ఈ వైరస్‌ ప్రవేశించినట్టుగా అనుమానిస్తున్నారు. చైనా తరువాత ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న దేశాల్లో దక్షిణ కోరియా ఒకటి. అయితే ఆ దేశంలో వైరస్‌ వ్యాప్తికి కారణం నేనే  అంటూ వ్యక్తి ప్రపంచాన్ని క్షమాపణ కోరాడు. ఓ చర్చిలో జరిగిన ప్రార్థనల సమయంలోనే ఈ వైరస్‌ ఎక్కువ మందిపై దాడి చేసినట్టుగా భావిస్తున్నారు.


వైరస్ తన వల్లే వచ్చిందంటూ దక్షిణ కొరియాకు చెందిన ఆ మతపెద్ద క్షమాపణ లు కోరాడు. చర్చి నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఓ 61ఏళ్ల మహిళ పాల్గొంది. అయితే అప్పటికే ఆమెకు కరోనా సోకింది. ఈ విషయం తెలియని ఆ చర్చి నిర్వాహకులు ఆమెను కార్యక్రమంలో అనుమతించారు . తర్వాతే దక్షిణ కొరియాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉండంటంతో ఆ రోజు చర్చిలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ పరీక్షలు నిర్వహించారు.


కానీ చర్చి వ్యవస్థాపకుడు మాన్ హీ మాత్రం కరోనా పరీక్షలు చేయించుకోవడానికి నిరాకరించాడు. పరీక్షలకు అంగీకరించకపోతే అరెస్ట్ చేస్తామంటూ ప్రభుత్వం ఒత్తిడి చేయటంతో మాన్‌ హీ పరీక్షలు చేయించుకోవడానికి అంగీకరించాడు. అయితే పరీక్షల్లో ఆయనకు కరోనా సోకలేదని తేలింది. కానీ  తన వల్లే దేశంలోకి కరోనా వచ్చిందని హీ బాధపడ్డారు. తనను మన్నించాలంటూ తల నేలకు ఆనించి క్షమాపణ కోరాడు. దక్షిణ కొరియాలో దాదాపు 4000 మందికి కరోనా సోకినట్టుగా అధికారిక లెక్కలు చెపుతున్నాయి. ఇప్పటికే 28 మంది ఈ వైరస్‌ ప్రభావంతో మరణించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు లక్ష మందికి ఈ వైరస్‌ సోకినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: