అమరావతి ఉద్యమం...గత రెండు నెలలుగా ఏపీలో ఒక ప్రాంతానికి పరిమైతమైన ఉద్యమం. రాష్ట్రాభివృద్ధి కోసమంటూ సీఎం జగన్ తీసుకొచ్చిన మూడు రాజధానులు వద్దు, అమరావతినే ముద్దు అంటూ ఓ 29 గ్రామాల వారు ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మూడు రాజధానులు కావాలన్న, ఇక్కడి ప్రజలు మాత్రం తాము రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చామని, కాబట్టి ఇక్కడే రాజధాని ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక గత ఐదేళ్లు రాజధానిలో ఎన్నో అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ కూడా, తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎక్కడ దెబ్బతింటుందో అనే ఉద్దేశంతో, ఉద్యమాన్ని వెనుకఉండి నడిపిస్తున్నారు.

 

దీంతో మూడు రాజధానుల ఏర్పాటు ఖాయమని తెలిసిన, జగన్ న్యాయం చేస్తానని చెప్పిన, అమరావతి ఒక రాజధానిగా అభివృద్ధి చెందుతుందని ప్రకటన చేసిన, అక్కడి ప్రజలు మాత్రం ఉద్యమాన్ని ఆపకుండా చేస్తున్నాయి. అయితే ఈ మూడు రాజధానులని ఆపాలని టీడీపీ అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర ప్రజలకు మూడు రాజధానులు కావాలని చెబుతున్న, చంద్రబాబు అండ్ కొ మాత్రం ఏదొరకంగా అడ్డుకోవాలనే చూస్తోంది. ఇక చంద్రబాబు బ్యాచ్‌కు, సొంత మీడియా కూడా తొడయ్యి అమరావతి ఉద్యమంతో రాష్ట్రం ఏదో అల్లకల్లోలం అయిపోతున్నట్లు చూపించారు.

 

మీడియాని అడ్డం పెట్టుకుని అమరావతిలో ఉద్యమాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. కొందరు అనారోగ్య కారణాల వల్ల చనిపోయిన, అమరావతి కోసం రైతుల గుండెలు ఆగిపోతున్నాయంటూ ప్రచారం చేయించారు. అలాగే ఏదో మేధావులు పేర్లు చెప్పి, తమ మీడియాల్లో డిబేట్లు పెట్టించి జగన్‌ని తిట్టించారు. ఇలా టీడీపీ అనుకూల మీడియా ఎంత చేసిన అమరావతి ఉద్యమం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా పడలేదు. ఆఖరికి అమరావతి ప్రాంతానికి అటు, ఇటు ఉండే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఈ ఉద్యమం ప్రభావం లేదు.

 

దీంతో బాబు మీడియా మేనేజ్మెంట్ మరోస్థాయికి చేరుకుంది. ఎవరో టీడీపీ అనుకూల ఎన్‌ఆర్‌ఐ అంతర్జాతీయ కోర్టులో అమరావతి గురించి ఏపీ ప్రభుత్వంపై కేసు వేశారు. ఆ కేసు వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోయిన, టీడీపీ అనుకూల మీడియా మాత్రం అంతర్జాతీయ స్థాయిలో అమరావతి ఉద్యమం అంటూ ప్రచారం చేసింది. ఇక ఇంత చేసిన ఒక్కరు కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కాబట్టి బాబు మీడియా ఎంత చేసిన రాష్ట్ర ప్రజలు మాత్రం మూడు రాజధానులకే అనుకూలంగా ఉన్నారు. ఏదేమైనా ఈ అంతర్జాతీయ కోర్టు వ్యవహారంతో అమరావతి మీడియా మేనేజ్మెంట్ కథ సమాప్తమైనట్లే.

మరింత సమాచారం తెలుసుకోండి: