విద్యార్థులకు ఇది శుభవార్తే అయినా ఈ శుభవార్త శుభంగా మాత్రం రాలేదు.. అదేంటి అనుకుంటున్నారా? అవును ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కారణంగా స్కూల్స్ మూసి వేశారు. ఇప్పటికే ఢిల్లీలో స్కూల్స్ మూసివేయ్యగా ఇప్పుడు హైదేరాబద్ లో కూడా కొద్ది రోజులు స్కూల్స్ మూసి వెయ్యాలి అని నిర్ణయించారు.       

 

ముందు జాగ్రత్తల్లో భాగంగానే  స్కూల్స్ ను మూసి వెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని మహేంద్రహిల్స్‌లోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కరోనా నిర్ధారణ అయి ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగిది మహేంద్ర హిల్స్ ప్రాంతమే కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

 

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పాఠశాలల యాజమాన్యాలు కూడా సెలవులు ప్రకటించాయి. మరోవైపు, ప్రస్తుతం చికిత్స పొందుతున్న సాఫ్ట్ వేర్ యువకుడు అదే ప్రాంతంలో తిరిగి ఉండటంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరుస్తున్నారు. ఖాళీ ప్రదేశాల్లో బ్లీచింగ్‌ను చల్లుతున్నారు.

 

కాగా ఇప్పటికే గూగుల్ వంటి సంస్దల నుండి పలు టెక్ సంస్దలు కూడా ఉద్యోగులను ఇంటి నుండే పని చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో ఎవరు బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటే మంచిది అని ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. 

 

కాగా చైనాలో వుహాన్ లో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. అందుకే ప్రభుత్వం అత్యంత వేగంగా ఈ వైరస్ ను అరికట్టాలి అని ముందస్తు నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాగా ఈ కరోనా వైరస్ భారిన పది ఎంతోమంది మరణించారు.. ఈ రాక్షస వైరస్ భారిన పడిన వేలమంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: