తెలుగుదేశం పార్టీలో సంక్షోభం మామూలుగా లేదు. పార్టీలో ఉన్న నాయకులు ఏ ఒక్కరు సంతోషంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఎప్పుడు ఎవరి అవినీతి వ్యవహారాలు బయటకి వస్తాయో, ఏ క్షణాన ఎవరు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందో అనే ఆందోళన వారిలో ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పార్టీ కార్యక్రమాల్లో కూడా నాయకులు ఉన్నా లేనట్టుగా  వ్యవహరిస్తున్నారు. అయినా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి మెరుగుపరచాల్సిన బాధ్యత చంద్రబాబు మీద ఉంది. అందుకే పార్టీ కార్యక్రమాలు, పర్యటన ఇలా ఎన్నో చేయాలనుకున్నా ముందుకు వచ్చేందుకు పార్టీ నేతలు ఎవరు సిద్ధపడడంలేదు. అయినా చంద్రబాబు ఏదో ఒక రకంగా ప్రజల్లో తిరగాలనే ఆకాంక్షతో నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. 

IHG


ఇంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఇంటి దొంగలు వ్యవహారం బయటకు వచ్చింది. పార్టీ అంతర్గతంగా తీసుకుంటున్న నిర్ణయాలు, చర్చించుకుంటున్న అన్ని అంశాలు రాజకీయ ప్రత్యర్ధులకు క్షణాల్లో తెలిసిపోతుండడంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు.  దీనిపై నిఘా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేది. ఏ విషయంలోనైనా ఎటువంటి కఠిన నిర్ణయాలు తీసుకోవదానికైనా  చంద్రబాబు వెనక ముందు ఆలోచించేవారు కాదు. నిత్యం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కార్యకర్తలతో మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో ఫీడ్ బ్యాక్ తెలుసుకునేవారు ఇప్పుడు ఆ విధంగానే చేస్తున్నా.. తాము తీసుకున్న అన్ని నిర్ణయాలు వెంటనే రాజకీయ ప్రత్యర్ధులకు క్షణాల్లో తెలిసిపోతున్నాయి. 

IHG

 

పార్టీ సీనియర్ నాయకులతో రహస్యంగా నిర్వహించిన అన్ని విషయాలు బయటకు వెళ్ళిపోతున్నాయి. దీనిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. కనీసం సమావేశాలకు హాజరయ్యే నాయకుల ఫోన్లను కూడా లోపలికి అనుమతించకుండా పగడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా క్షణాల్లో ప్రత్యర్థులకు సమాచారం వెళ్ళిపోతోంది. ఈ పరిణామాలు చంద్రబాబు లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవలే పేదలకు ఇళ్ల పట్టాల కోసం సేకరించే స్థలాల విషయంలో ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని, వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని ఉదాహరణలతో సహా చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో చర్చించారు. 

IHG


అయితే టెలికాన్ఫరెన్స్ ముగిసే సమయానికి ఇదే విషయంపై సదరు మంత్రి, అధికారులు దీనిపైనే ప్రకటన చేయడం, ఎక్కడ అవినీతి లేదని, అంతా సజావుగానే జరుగుతుందని చెప్పడంతో చంద్రబాబుతో సహా ఆ టెలికాన్ఫరెన్స్ లో పాల్గొన్న నాయకులు అంతా షాక్ కు గురయ్యారట. ఇదంతా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలో కొంతమంది అధికార పార్టీకి సమాచారం చేస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు గ్రహించి వారికి గట్టిగా క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఇక నాయకుల్లోనూ వైసిపి కోవర్టులు ఉన్నారని చంద్రబాబు అనుమానిస్తున్నారు. అందుకే అందరిపైనా నిఘా ఏర్పాటు చేసినట్టు పార్టీలో జరుగుతున్న చర్చ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: