కరోనా ప్రభావం రోజు రోజుకు పెరిగిపోతున్నది.  ఇప్పటికే దీని వలన దాదాపుగా ప్రపంచంలో 3000మందికి పైగా మృత్యువాత పడ్డారు.  దేశంలో కరోనా గురించిన అనేక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.  తాజా సమాచారం ప్రకారం 28 మందికి కరోనా సోకినట్టుగా తెలుస్తోంది.  ఇందులో ఇటలీ నుంచి వచ్చిన టూరిస్టులు 16 మంది ఉన్నారు.  ఇది నిజంగా ఇండియాను భయపెట్టే అంశం అని చెప్పాలి.  కరోనా వలన ఇప్పటికే అనేక ఇబ్బందులు కలుగుతున్న సమయంలో ఇప్పుడు ఇలాంటి బయలు కలుగుతుండటం బాధాకరం.  


మరోవైపు కరోనా దెబ్బకు దేశంలో మాస్క్ లు కరువయ్యాయి.  మాస్క్ లు దొరకడం లేదు.  బ్లాక్ మార్కెట్ కు కరోనా మాస్కులు తరలివెళ్తున్నాయి.  ఇకపోతే, కరోనా గురించి ఎన్ని వదంతులు వ్యాపిస్తున్నాయో చెప్పక్కర్లేదు.  కరోనా నుంచి బయటపడేందుకు ప్రజలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు.  అటు ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.  కేంద్రం కరొనాను ఎదుర్కొనడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.  


ఇక ఇదిలా ఉంటె పార్లమెంటుకు వెళ్లే ఎంపీలు కూడా మాస్కులు పెట్టుకొని వెళ్తున్నారు.  ఒక చోట ఎక్కువ మంది ఉండకూడదు అని ప్రభుత్వం చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.  మహారాష్ట్ర అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ ముఖానికి మాస్క్ ధరించి పార్లమెంట్ కు వెళ్ళింది.  అక్కడ ఆమెను చూసిన సహచర ఎంపీలు అభినందించారు.  యువ ఎంపీ చురుగ్గా ఉండటంతో పాటుగా పార్లమెంట్ సమావేశాలకు విధిగా హాజరవుతూ తన వంతు పాత్ర పోషిస్తోంది.  


నియోజక వర్గంలో కూడా ఆమె తన భర్త, ఎమ్మెల్యేతో కలిసి పర్యటిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటోంది.  ఇలా రెండు రకాలుగా ఆమె బహుముఖ పాత్ర పోషిస్తూ రాజకీయ నాయకురాలిగా రాణిస్తున్నది.  దీంతో ఆమెకు మంచి పేరు వస్తున్నది.  గతంలో నరేంద్ర మోడీ గురించి పార్లమెంట్ లో చేసిన ప్రసంగం అద్భుతం అని చెప్పొచ్చు.  ఆర్టికల్ 370 విషయంలో ఆమె చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: