ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఆశలపై జగన్మోహన్ రెడ్డి నీళ్ళు చల్లేశాడు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో బిసిల రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వాన్ని సుప్రింకోర్టుకు వెళ్ళేట్లు చేయాలని చంద్రబాబునాయుడు చాలానే ప్రతయ్నించాడు. ఇందులో భాగంగానే  జగన్ పై ఆరోపణలు చేశాడు,  బిసిల సంక్షేమంపై చిత్తశుద్ది లేదంటూ మండిపడ్డాడు. సుప్రింకోర్టులో రివ్యు పిటీషన్ వేయాలంటూ  సూచించాడు. ప్రభుత్వం కేసు వేస్తే తాము కూడా ఇంప్లీడ్ అవుతామంటూ ఊరించాడు.

 

ఇలా చంద్రబాబు ఎన్ని రకాలుగా రెచ్చకొట్టినా జగన్ మాత్రం దేనికి ఉలకలేదు పలకలేదు. తాను అనుకున్న విషయాన్ని చాలా కామ్ గా అమలు చేయటానికి నిర్ణయించుకున్నారు. ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో హై కోర్టు ఆదేశాలిచ్చినట్లుగా 50 శాతం రిజర్వేషన్లతోనే స్ధానిక సంస్దల ఎన్నికలు జరపాలని మంత్రివర్గం డిసైడ్ చేసింది. దాంతో చంద్రబాబు ఆశలపై జగన్ నీళ్ళు చల్లినట్లైంది.

 

దశాబ్దాలుగా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న బిసిలను చంద్రబాబు చాలా కష్టపడి దూరంగా తరిమేశాడు. 2014లో అధికారంలోకి రావటమే ధ్యేయంగా చంద్రబాబు నోటికొచ్చినన్ని హామీలిచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కేశారు. చంద్రబాబు హామీలతో మోసపోయిన వారిలో బిసి సామాజికవర్గాలు కూడా ఉన్నాయి. ఇందుకనే మొన్నటి ఎన్నికల్లో బిసిల్లో స్పష్టమైన చీలిక వచ్చేసింది. మొదటిసారిగా బిసిల్లో కూడా కొందరు వైసిపికి మద్దతుగా నిలబడ్డారు.

 

 సరే అదంతా చరిత్రని అనుకుంటే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా బిసిలను చంద్రబాబు మోసం చేయటం మానలేదు. ప్రభుత్వం ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్ కు వ్యతిరేకంగా తన మద్దతుదారుడితో కోర్టులో కేసు వేయించాడు. ఆ కేసు ఫలితంగా  ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కొట్టేసింది. దీని ఫలితంగా బిసిల రిజర్వేషన్ 34 నుండి 25 శాతానికి పడిపోయింది. తన బండారం బయటపడగానే చంద్రబాబు జగన్ ను రెచ్చగొట్టడం మొదలుపెట్టారు. అయితే జగన్ రెచ్చిపోకుండా చంద్రబాబు ఆశలపై నీళ్ళు చల్లుతూ ఎన్నికల నిర్వహణకే మొగ్గుచూపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: