ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాల‌ను వ‌ణికించేస్తోన్న ఇప్ప‌డు చైనా నుంచి ప్రారంభ‌మై మిగిలిన అన్ని దేశాల‌కు విస్త‌రిస్తోంది. మ‌నదేశంలో ముందుగా కొన్ని రోజుల క్రితం కేర‌ళ‌లో ఒక వ్య‌క్తి క‌రోనా వైర‌స్ సోకింది. ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల‌కు కూడా ఇది క్ర‌మ క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా తెలంగాణ‌కు కూడా సోకిన ఈ వైర‌స్ దెబ్బ‌తో ఇప్పుడు అంద‌రూ క‌కావిక‌ల మ‌వుతున్నారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ?  తెలియ‌ని ప‌రిస్థితిలో విల‌విల్లాడుతున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన ఓ టెక్కీ బెంగ‌ళూరులో ఉద్యోగం చేస్తూ హాంకాంగ్‌కు వెళ్ల‌గా ఆ వ్య‌క్తికి క‌రోనా సోకింది. దీంతో బెంగ‌ళూరులో అత‌డు నివాసం ఉంటోన్న ఇంటికి అక్క‌డ అధికారులు తాళాలు వేశారు.

 

ఇక ఇప్పుడు హైద‌రాబాద్ గాంధీ ఆసుప‌త్రిలో గంట గంట‌కు క‌రోనా అనుమానితులు పెరుగుతున్నారు. ఇక హైద‌రాబాద్‌లో కూడా క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చేసింది.  ఓ కంపెనీ ఉద్యోగికి కరోనా పాజిటివ్ రిపోర్టు వచ్చింది. గచ్చి బౌలిలోని మైండ్ స్పేస్ బిల్డింగ్ లో 9వ ఫ్లోర్ లో ఓ కంపెనీ వుంది. ఓ ఉద్యోగికి కరోనా సోకడంతో ఆ కంపెనీ జాగ్రత్తపడింది. ఆ టెక్కీకి క‌రోనా పాజిటివ్ ఉంద‌ని తేల‌డంతో ఆ కంపెనీలో ప‌ని చేసే ఉద్యోగులు అంద‌రూ తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు. ఇక ఆ కంపెనీ ఉద్యోగుల‌కు సెల‌వులు ఇచ్చేసింది. ఉద్యోగులను వర్క్ ‌ఫ‌్రమ్ హోం చేయాలని కోరింది. 

 

అలాగే ఇదే ఫ్లోర్ లో ఉంటున్న ఓపెన్ టెక్ట్స్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 28 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆగ్రాలో 6, కేరళలో 3, ఢిల్లీ, తెలంగాణలో చెరో కేసు నమోదు అయింది. మన దేశంలో పర్యటిస్తున్న 16 మంది ఇటాలియన్ పర్యాటకులకు కరోనా ఉన్నట్లు గుర్తించారు. కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్థుల సంఖ్య తొంభైవేలు దాటింది. మృతుల సంఖ్య మూడు వేలు దాటినట్లు తెలుస్తోంది. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: