ఏపిలో ఇప్పుడు అధికారంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వం పై ప్రతి చిన్న విషయంలో పని కట్టుకొని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.  ప్రతిపక్ష హోదాలో ఉండుకుంటూ ప్రజా సమస్యలపై మాట్లడ కుండా తమకు తోచిన పిచ్చి విషయాలు ముందు వేసుకు వస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు అధికార పార్టీ వైసీపీ నేతలు.  నిన్న బోండా మద్యం విక్రయం విషయంలో  అధికార పార్టీపై ధ్వజమెత్తిన విషయం తెలిసిందే. ఈ మద్యాన్ని వాలీంటర్లతో ఇంటికే సప్లై చేయిస్తున్నారని ఆరోపణలు చేశారు.  అయితే బోండ విమర్శపై అధికార పార్టీ నేతలు కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. 

 

ఈ నేపథ్యంలో వైసీపీ నేత ఎంపి విజయ సాయిరెడ్డి తన ట్విట్టర్ వేధికగా టీడీపీ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ బాబు లు అధికార పార్టీపై చేస్తున్న విమర్శలకు గట్టి సమాధానం ఇస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా టీడీపీ నేత నారా లోకేశ్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  మరోసారి తనదైన స్టైల్లో తీవ్ర విమర్శలు గుప్పించారు.  ఏపీలో 4.5 లక్షల మంది వాలంటీర్లపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు ఆయన కౌంటర్‌ ఇస్తూ ట్వీట్ చేశారు. మాలోకాన్ని కరోనా క్వారంటైన్ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది.

 

అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్ అని తిట్టి పోస్తున్నాడు' అని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.  ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పై తెగ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఆయన లోకేష్ పై వెరైటీ పంచ్ లు వేయడం చర్చనీయాంశంగా మారింది.  ప్రజలకు వాస్తవాలు తెలుసని లేనిపోని అపోహలకు పోతూ టీడీపీ నేతలు తమను తామే చిన్నబుచ్చుకుంటున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: