కరోనా వైరస్ దెబ్బతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభిస్తోంది. ఇప్పటికే చైనాతో పాటు చైనా చుట్టుపక్కల ఉన్న దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, థాయిలాండ్, బర్మా, హాంకాంగ్ లాంటి దేశాల్లో ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు. గత 45 రోజులుగా చైనాను కరోనా వైరస్ ఎలా తిప్పులు పెడుతోందో ? చూస్తూనే ఉన్నాము. ముందు నుంచి అందరూ భయపెడుతున్న టు గానే భారత్ కూడా ఈ కరోనా వైరస్ చేరింది. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం భారత్లో 28 మంది బాధితులు ఉన్నారు. ప్రపంచ మార్కెట్లో ఎక్కడికక్కడ ఆర్థిక స్థితిగ‌తులు మందగించాయి. భారత స్టాక్ మార్కెట్ల‌పై సైతం కరోనా దెబ్బ కూడా పడుతోంది. అపర కుబేరులు సైతం కోట్లాది రూపాయల సంపాదన కోల్పోతున్నారు. ఉత్పత్తి రంగం పై సైతం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటోంది.



ఇక అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన తిరుమ‌ల తిరుప‌తి వెంక‌న్న‌పై కూడా క‌రోనా ప్ర‌భావం గ‌ట్టిగానే ప‌డ‌నుంద‌ని తెలుస్తోంది. క‌రోనా రోజు రోజుకు శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోన్న నేప‌థ్యంలో పరిస్థితి ఇలాగే ఉంటే తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు లక్షల్లో వచ్చే భక్తులు కనీసం వేలల్లో కూడా రాకపోవచ్చు అన్న ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. క‌రోనా వైర‌స్ జ‌నాలు ఎక్కువుగా ఉన్న చోట శ‌ర‌వేగంగా విస్త‌రించే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోన్న ప్ర‌చారం సైతం అనేక సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.



సోషల్‌ మీడియాలో కొందరు తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా బాధితుడు సంచరించాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. దీంతో తిరుమ‌ల‌కు వెళ్లాల‌నుకుంటోన్న వారిలో కొంద‌రు ఆగిపోయే అవ‌కాశాలు ఉన్నాయి. ఏదేమైనా క‌రోనా వైర‌స్ ఏ టైంలో ఎక్క‌డ నుంచి ఎలా ?  వ‌స్తుందో ?  తెలియ‌క పోవ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే భ‌య‌ప‌డుతున్నారు. ఇప్పుడు ఈ వైర‌స్ ప్ర‌భావం అటు తిరిగి ఇటు తిరిగి.. చివ‌ర‌కు వెంక‌న్న‌పై సైతం పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: