2012 డిసెంబర్ 17 వ తేదీన నిర్భయపై ఆరుగురు నిందితులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.  ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడింది.  పదిరోజుల చికిత్స ఆనంతరం డిసెంబర్ 26 వ తేదీన ఆమె మరణించింది.  ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఈ కేసులో మొత్తం ఆరుగురు దోషులను పోలీసులు పట్టుకొని కేసులు పెట్టి పోర్టులో ప్రొడ్యూస్ చేయగా కోర్టు ఆరుగురికి ఉరిశిక్ష విధించింది.  అయితే, ఇందులో ఓ వ్యక్తి 2013లోనే జైలులో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  మరొక వ్యక్తి మైనర్ కావడంతో మూడేళ్ళ జైలు శిక్ష తరువాత విడుదలయ్యాడు. 


కాగా, నలుగురు దోషులు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు.  శిక్ష పడిన నలుగురు నిందితులను ఉరి తీయాలని చాలా కాలంగా డిమాండ్ వస్తున్నా ప్రభుత్వాలు ఆలస్యం చేస్తూ వచ్చాయి.  మహిళల విషయంలో అత్యాచారాలకు పాల్పడిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ రావడంతో దోషులకు జనవరి 22 వ తేదీన ఉరి తీయాలని పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.  


అయితే, కోర్టులో వీరికి సంబంధించిన పిటిషన్లు పెండింగ్ లో ఉండటంతో ఉరి వాయిదా పడింది.  ఫిబ్రవరి 1 న ఉరి తీయాలని మరలా పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.  అది కూడా కుదరలేదు.  మార్చి 3 న ఉరితీయాలని మరోమారు పాటియాలా కోర్టు తీర్పు ఇచ్చింది.  కానీ, మార్చి 2 వ తేదీన పవన్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోవడంతో మరోసారి ఉరి వాయిదా పడింది. 


కాగా, ఆ పిటిషన్ ను రాష్ట్రపతి ఈరోజు తిరస్కరించారు.  దీంతో వీరిపై ఎలాంటి పిటిషన్లు ప్రస్తుతం పెండింగ్ లో లేవు.  మరో రెండు మూడు రోజుల్లో పాటియాలా కోర్టు మరోసారి డెత్ వారెంట్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు కావాలని దోషులు తప్పించుకోవడానికి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు.  దీనిపై కోర్టు ఇప్పటికే అనేకసార్లు వార్నింగ్ ఇచ్చింది.  ఈసారి అలా కాకుండా మరో పిటిషన్ వేయకుండా తీర్పు ఇచ్చి ఉరి తీస్తే బాగుంటుంది.  దోషుల తరపున వాదిస్తున్న లాయర్ పై కూడా కఠిన చర్యలు తీసుకుంటే బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: