అసలే పోలీసులు.. వీరికి ముక్కు మీద కోపాలని అందరు అనుకుంటారు.. ఇందులో కూడా మంచివారున్నారండి.. కాకపోతే కొందరు మాత్రం ఎప్పుడు కోపంతో ఊగిపోతుంటారు.. ఇలాంటి వారికి తప్పుచేసిన వాడు ఎవడైనా దొరికాడంటే ఆకలితో ఉన్న సింహానికి ఆహారం దొరికినట్లే.. మామూలుగా ఉండదు.. వాన్ని చెడుగుడు ఆడేస్తారు..

 

 

ఎక్కడెక్కడి కోపమంతా వాడి పైనా తీస్తారు.. అందులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల విషయంలో అయితే మరీ ఆ డోస్ ఎక్కువగా ఉంటుంది.. ఇలా ఆవేశపూరితంగా ప్రవర్తించిన ఓ ఖైదీ తన వీపును పోలీసుల చేతిలో పచ్చడి పచ్చడిగా చేసుకున్నాడు..

 

 

ముంబయిలో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వివరాలు పరిశీలిస్తే.. ముందుగా పోలీసులతో ఖైదీగా ఉన్న ఓ వ్యక్తి కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. ఇతన్ని కోర్టు నుంచి సెంట్రల్ జైలుకు వ్యానులో తరలిస్తుండగా అతనికి గార్డ్‌గా ఉన్న కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగడమే కాకుండా.. అతడిపై ఉమ్మి వేశాడు.

 

 

దీంతో కోపంతో ఊగిపోయిన అక్కడి పోలీసులు ఆ వ్యాన్‌లోనే ఆ ఖైదీని చితక బాదారు. ఆ ఖైదీ పేరు అలీ.. ఇతను థానే సెంట్రల్ జైల్లో అండర్‌ట్రైల్‌లో ఉన్న ఖైదీ.. ఇతన్ని పోలీసులు జిల్లా కోర్టులో హాజరుపరిచి, అక్కడి నుంచి తిరిగి జైలుకు తీసుకెళ్తుండగా అలీ కుటుంబికులు ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని అలీకి ఇవ్వబోయారు.

 

 

అయితే, ఓ కానిస్టేబుల్ ఇందుకు నిరాకరించాడు. దీంతో కోపంతో అలీ వ్యానులో ఆ కానిస్టేబుల్‌ను దుర్భషలాడుతూ, అతనిపై ఉమ్మి వేయడంతో గొడవ పెద్దదైంది. దీంతో అక్కడున్న వారంత కలిసి ఒక రౌండ్ వేసుకున్నారు..

 

 

ఇదంతా మరో కానిస్టేబుల్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఇది కాస్త వైరల్‌గా మారింది... ఇక అతను ప్రవర్తించిన విధానం సరిగ్గా లేదు.. అదేమైనా అతని అత్తవారిల్లు అనుకున్నాడు కావచ్చని ఈ విషయం తెలిసిన నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: