స్ధానిక ఎన్నికలను స్వీప్ చేయటం ద్వారా భవిష్యత్తులో తెలుగుదేశంపార్టీని కోలుకునేందుకు వీల్లేనంతగా దెబ్బ కొట్టాలని జగన్మోహన్ రెడ్డి భారీ ప్లానే వేసినట్లున్నాడు. తన ప్లాన్ లో భాగంగానే అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా దృష్టి పెట్టాడు. తన సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని దాదాపు అన్నీ సామాజికవర్గాలను టచ్ చేసేట్లుగా వ్యూహాత్మకంగా వెళుతున్నాడు. ఊహిచని రీతిలో మొన్నటి ఎన్నికల్లో బంపర్ మెజారిటి సాధించిన జగన్ తర్వాత గురిని స్ధానిక సంస్ధల ఎన్నికలపైనే పెట్టాడనటంలో సందేహమేలేదు.

 

రైతుభరోసా, అమ్మఒడి, విద్యాదీవెన, ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం లాంటి సంక్షేమ పథకాల అమలంతా ఇందులో భాగమే. ప్రతిపక్షాలను లేవకుండా దెబ్బకొట్టడమే ఏకైక ధ్యేయంగా జగన్ ముందుకెళుతున్నాడు. సరే ఈ క్రమంలో జగన్ ప్రభుత్వంపై జనాల్లో ఎంతో కొంత వ్యతిరేకత అన్నది సహజమే. ఇసుక కొరత, రాజధాని తరలింపుతో అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లోని రైతుల్లో వ్యతిరేకత లాంటివి ఉదాహరణలు చెప్పుకోవచ్చు.

 

మామూలుగా ఏ ప్రభుత్వం విషయంలో కూడా ప్రతిపక్షాలు చేయనంత రచ్చను చంద్రబాబునాయుడు చేస్తున్నారు. తనకు సంపూర్ణ మద్దతునిచ్చే మీడియా చేతిలో ఉంది కాబట్టి జగన్ కు వ్యతిరేకంగా ఆకాశమేహద్దుగా చంద్రబాబు చెలరేగిపోతున్న విషయం అందరూ చూస్తున్నదే. ఇందులో భాగంగానే చిన్న విషయాలను చాలా పెద్దవిగాను లేని వాటిని కూడా ఉన్నట్లుగాను పచ్చమీడియాతో బురద చల్లిస్తున్నాడు.

 

సరే చంద్రబాబు ఇలాంటి రాజకీయాలే చేస్తాడన్న విషయం  జగన్ కు  తెలియంది కాదు. అందుకనే అధికారంలోకి వచ్చిందగ్గర నుండి ఏదో ఓ సంక్షేమ పథకం అమలు పేరుతో నేరుగా జనాలతోనే టచ్ లోనే ఉంటున్నాడు.  ఈ విషయం జగన్ కు బాగా ప్లస్ అయితే చంద్రబాబుకు బాగా మైనస్ అనే చెప్పాలి. మొన్నటికి మొన్న ఇంటింటికి ఫించన్ పంపిణీ, 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీ పథకం కూడా ఓటర్లను నేరుగా టచ్ చేయటంలో భాగమనే అనుకోవాలి. ఇటువంటి పథకాలు బాగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయన్న మంటతోనే చంద్రబాబు తప్పుదు ఆరోపణలు చేస్తు, కథనాలు రాయిస్తున్నాడు. జగన్ ప్లాన్ గనుక వర్కవుటైతే చంద్రబాబుతో పాటు పచ్చమీడియాకు చుక్కలు కనబడటం ఖాయమనే అనుకోవాలి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: