కరోనా వైరస్‌ను నివారించడంలో ఒక రకంగా చైనా విఫలమైందని చెప్పవచ్చు.. నివారణ విషయంలో విఫలమైనా ఈ రోగాన్ని అందరికి అంటించడంలో మాత్రం విజయాన్ని సాధించింది.. ఇక చైనా లాంటి దేశమే కరోనాను అరికట్టడంలో చేతులెత్తేయగా, ఇక మనదేశంలో చాపకింద నీరులా పాకుతున్న కరోనా.. చైనాలో విజృంభించినట్లుగా తన ప్రతాపం చూపిస్తే.. భారతదేశ పరిస్దితి ఏంటి అనేది తలుచుకుంటేనే ఒక్కొక్కరికి నిదురకూడ పట్టని పరిస్దితి.. మన ప్రభుత్వాలు మెరుగైన పనితీరుని కనపరచి ఈ వ్యాధి తీవ్రతను అరికట్టుతాయా.. లేదా ఎన్నికల్లో ఓటర్లను మభ్యపెట్టినట్లుగా, మాయచేసి కరోనా పేరుతో వందల కోట్లు నొక్కేస్తారా అనేది పెద్ద ప్రశ్నలా మారింది..

 

 

ఇకపోతే గతనెలలో కేరళ రాష్ట్రంలో కూడా మూడు కరోనా కేసులు నమోదయ్యాయి.అదృష్టవశాత్తూ ఆ ముగ్గురిలో ఎవరూ వైరస్ కారణంగా మరణించలేదు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కేరళ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుందో లైవ్ మింట్ రిపోర్టులో తెలిపింది.  ఇకపోతే 2018, 2019 వ సంవత్సరాల్లో ఆ రాష్ట్రం ప్రాణాంతక నిఫా వైరస్ వ్యాపించినప్పుడు.. వైరస్ సోకిన వ్యక్తిని సకాలంలో గుర్తించడంలో కేరళ సమయస్ఫూర్తితో సమర్థవంతంగా పనిచేసింది. అందుకే వైరస్ బాధితుల సూచికలో జీరోకు చేరింది.

 

 

ఇప్పుడు ఇదే ఫార్మాలాను కరోనా వైరస్ విషయంలో కూడా అప్లై చేసింది. ఇందులో భాగంగా.. పబ్లిక్ ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ నిర్వహించడం, వీటితో పాటుగా రెగ్యులర్ చెకప్స్ చేయడం, అనుమానం ఉన్న ప్రతి పేషంట్ ను గుర్తించి వారికి తక్షణ వైద్య పరీక్షలు చేయడమే కాకుండా ప్రతి మూడు గ్రామాలకు రెండు ప్రధాన ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి 3.95 కిలోమీటర్లకు ఒకటి చొప్పున సగటున 7.3 కిలోమీటర్ల దూరంలో జాతీయంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అనుభవం కలిగిన వైద్యులను రంగంలోకి దించింది. కేవలం రూ.5 వైద్య సౌకర్యాలు అందించేలా చూసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 40 పడకలను గుర్తించి వాటిని కరోనా బాధితుల కోసం కేటాయించింది..

 

 

ఇదే కాకుండా కరోనా వైరస్ సోకిన తొలి కేసు నమోదు కాగానే రాష్ట్రం మొత్తం సెల్ఫ్ డిజైన్డ్ ప్రొటోకాల్ అమల్లోకి తెచ్చింది. వైరస్ సోకిన వ్యక్తి కలిసిన వ్యక్తుల్లో కూడా వైరస్ సోకే అవకాశం ఉండటంతో అనుమానితులను గుర్తించి వెంటనే సమాచారం అందించేలా ప్రోత్సహించింది. ఇందుకోసం 18 మంది నిపుణుల సభ్యులతో ప్రత్యేకించి కంట్రోల్ రూమ్ ఓపెన్ చేసింది. విదేశీ శాఖలతో పాటు ఇళ్లల్లోనే నిర్బంధాన్ని ఏర్పాటు చేసింది. లాజిస్టిక్స్, వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చింది.

 

 

ఇకపోతే స్థానిక ఆరోగ్య అధికారులంతా వైరస్ బాధితులను ఇళ్లల్లోనే 28 రోజుల వరకు నిర్బంధించేలా చర్యలు చేపట్టి.. బాధితులకు అవసరమైన వైద్య సదుపాయాలు, నిత్యావసర వస్తువులను అందించేలా ఏర్పాటు చేపట్టింది. ఇవే కాకుండా ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆలోచనలను అమలులో పెట్టి పకడ్బందిగా అమలు చేసి తుదకు కరోనా పై విజయాన్ని సాధించింది.. మరి ఇంతటి ఆలోచనను మన ప్రభుత్వాలు చేసి ఇప్పుడు ఉగ్రవాదం కంటే భయంకరమైన ఈ సమస్య నుండి ప్రజల ప్రాణాలను ఎలా కాపాడుతారో అనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది..

మరింత సమాచారం తెలుసుకోండి: