దాదాపు రెండేళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైన విషయం తెలిసిందే. మార్చి నెలాఖరులోపే ఎన్నికలు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసేశారు. ఈ క్రమంలోనే మార్చి 21న ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి, మార్చి 24న మున్సిపాలిటీ, మార్చి 27న పంచాయితీ ఎన్నికలు జరిగే అవకాశముందని ప్రచారం జరుగుతుంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి ఇవే తేదీలని సూచించినట్లు తెలుస్తోంది.

 

అయితే తేదీలు సంగతి పక్కనబెడితే, ఎన్నికల గురించి వస్తే స్థానిక సమరంలో వైసీపీకే మెజారిటీ సీట్లు దక్కే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లుకి గాను, 151 గెలిచింది కాబట్టి దాదాపు 75 శాతం సీట్లు వరకు వైసీపీకి దక్కే ఛాన్స్ ఉంది. ఇక తర్వాత ప్రతిపక్ష టీడీపీ కూడా బలంగా ఉన్నచోట్ల సత్తా చాటే అవకాశముంది. అలాగే మెజారిటీ స్థానాల్లో వైసీపీకి గట్టి పోటీ ఇస్తుంది. కాకపోతే ఈ రెండు పార్టీలకు కింది స్థాయిలో కేడర్ బలంగా ఉంది. కానీ జనసేనకు మాత్రం ఆ స్థాయిలో లేదు.

 

అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక సీటు గెలుచుకున్న దాని బట్టే పరిస్థితి ఏంటో అర్ధమైపోయింది. ఇక జనసేనతో జోడీ కట్టిన బీజేపీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాబట్టి స్థానిక ఎన్నికల్లో జనసేనకు పెద్ద సీన్ ఉండదనే సంగతి అర్ధమైపోతుంది. ఈ నేపథ్యంలోనే జనసేనకు మద్ధతుగా ఉండే పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం ఓటర్లు అధికార వైసీపీ అభ్యర్ధులకు మద్ధతు ఇచ్చేందుకు చూస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఎలాగో తమ పార్టీ గెలవదు, పైగా వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ అభ్యర్ధులకు సపోర్ట్ ఇస్తే స్థానికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నారట. అయితే కొన్ని చోట్ల వైసీపీ నేతలు గిట్టని జనసేన కార్యకర్తలు టీడీపీకి మద్ధతు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికైతే జనసైనికులు స్థానికంలో రూట్ మార్చేలా కనిపిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: