ప్రపంచ దేశాలను మరియు మహామహులను వణికిస్తున్న పేరు ‘కరోనా వైరస్’. చైనా దేశం లో పుట్టిన ఈ వైరస్ వాళ్ళ చాలామంది ఇప్పటికీ ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఇప్పటికే భారతదేశంలో మరియు అనేక దేశాలలో ఈ వ్యాధి బయటపడింది. తెలంగాణలో ఇటీవల హైదరాబాద్ నగరంలో కూడా ఈ వ్యాధి బయటపడింది. హైదరాబాద్ నగరం సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయ్ ఇటీవల ఇటలీ వెళ్లి మళ్లీ తిరిగి కంపెనీకి రావడం జరిగింది. అయితే ఆ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తేలడంతో సదరు కంపెనీ ఎంప్లాయిస్ అందర్నీ ఇంటికి పంపించేసి 'వర్క్ ఎట్ హోమ్' చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

 

దీంతో హైదరాబాద్ నగరం హైటెక్ సిటీ లో కూడా ఈ వ్యాధి బయట పడటంతో హైదరాబాద్ వాసులంతా బిక్కుబిక్కుమంటున్నారు. మరోపక్క భారత ప్రభుత్వం కూడా ఈ వ్యాధిని అరికట్టాలని ఎక్కడికక్కడ వైద్య పరీక్షలు చేసే బృందాన్ని ఇంకా అనేకమందిని వైద్యులను రంగంలోకి దింపుతుంది. సికింద్రాబాద్ మహేంద్రా నగర్ కాలనీలో కూడా దుబాయ్ నుండి వచ్చిన వ్యక్తికి 'coronavirus' ఉందని తేలడంతో సదరు వ్యక్తి ఇంటి చుట్టు పక్కల అంతా ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా తలుపులు వేసుకుని అలానే ఉండిపోయారు. దీంతో కరోనా వైరస్ వల్ల చాలామంది భయ పడుతున్న నేపథ్యంలో కొంతమంది ఆకతాయిలు క్యాష్ చేసుకోవడానికి వింత ప్రచారాలు చేస్తున్నారు.

 

తాజాగా కరోనా విషయంలో ఒక దారుణమైన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆవు పేడతో స్నానం చేస్తే కరోనా రాదని అంటున్నారు. దేశంలో కరోనా వలన జనం భయపడి చస్తుంటే ఎవడి ప్రచారం వాడు ఎవడికి తోచిన విధంగా వాడు చేస్తూ జనాల్లో పాపులర్ అవుతున్నారు. తాజాగా ఆవు పేడ విషయంలో ఇదే విధంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఆవు పేడ ఆరోగ్యానికి చాలా మంచిదని వ్యాఖ్యానిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎక్కువ వైరల్ కావడంతో ఇటువంటివి నమ్మొద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: