చైనాలో హాట్ టాపిక్‌గా మారిన కరోనా.. ప్రస్తుతం పట్టణ వాసులను వణికిస్తుంది.. తాజాగా నగరంలో ఈ వైరస్ వ్యాపిస్తుందనే వార్తలు ఊపందుకోవడంతో ఎవరికి వారే భయాందోళన చెందుతున్నారు.. ఇకపోతే కరోనా వైరస్ ఒక ఐటి ఉద్యోగికి వచ్చింది అనే అనుమానంతో కూడిన భయంతో మైండ్ స్పేస్ ను ఖాళీ చేయించడం సరైనది కాదని ఐటీ నిపుణులు కరణ్ చంద్ర తెలిపారు.

 

 

ఇదే అంశంపై మార్చి 4 వ తేదిన అంటే ఈ రోజు ఒక ప్రముఖ చానల్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఐటీ ఉద్యోగులను ఇళ్లకు పంపించి ఐసోలేషన్ కు ఉన్న అకాశాన్ని కూడా కోల్పోయారని చెప్పారు. రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ కంపెనీల యాజమాన్యాలు కనీస సామాజిక బాధ్యత లేకుండా, బాధ్యతారాహిత్యంగా క్యారియర్స్ ను సమాజంలోకి వదిలి ఈ వ్యాధి వ్యాప్తిని నియంత్రించే మంచి అవకాశాన్ని మిస్ హ్యాడింల్ చేశారని పేర్కొన్నారు..

 

 

ఒక ఐటీ సెక్టార్ లో ఇలాంటి పరిస్దితి ఎదురైనప్పుడు, ఐటీ మేనేజ్ మెంట్ ఇలా బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్. ఇది ప్రపంచం మొత్తం ఎదుర్కొంటున్న సమస్య... ఇక ఒక కంపెనీలోని ఒక ఫ్లోర్ లో ఒక వ్యక్తికి కరోనా సోకిందంటే 9 రోజులు తర్వాత బయటపడుతుంది. ఈ లోపు క్యారియర్స్ గా ఎంతమంది మారారనేది దానిపై క్లారిటీ లేదు. ఆ ఐదు వందలు, మూడొందల మందిని కర్డూన్ ఆప్ చేసి, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎలిమినేట్ చేసుకుంటూ పోతే ఇంతకన్నా మంచి అవకాశం దొరికేది తెలిపారు..

 

 

ఇదే కాకుండా మినిమమ్ సామాజిక బాధ్యత లేకుండా, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తూ రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ కంపెనీల యాజమాన్యాలు,  కరోనా క్యారియర్స్ ను సమాజంలోకి వదిలారు. అందుకే ఈ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.. ఏది ఏమైనా కరోనా భయంతో ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేయించకుండా 11 వేల మంది ఉద్యోగులను ఇళ్లకు పంపడం అనేది సరైన నిర్ణయం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతుందట.. 

మరింత సమాచారం తెలుసుకోండి: