తెలంగాణ రాజకీయాల్లో టిఆర్ఎస్ పార్టీ హవా కొనసాగుతున్న సమయంలో.. అసలు సిసలైన ప్రతిపక్ష నేతగా కెసిఆర్ కు  సమవుజ్జీగా పేరు తెచ్చుకున్నది ఎవరు అంటే అందరికీ టక్కున గుర్తొచ్చే పేరు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన వాక్చాతుర్యంతో ప్రభుత్వం తీరును ఎండగడుతూ ప్రతిపక్ష నేతగా ప్రజల్లో ఎంతో అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇక ఒకానొక సమయంలో టిడిపి పార్టీ పరిస్థితి అధ్వానంగా మారుతున్న సమయంలో కూడా టిడిపి పార్టీలో ఉండి ఏకంగా అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించారు రేవంత్ రెడ్డి. ఇక ఆ తర్వాత 2018 ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ముందు నుంచి రేవంత్ రెడ్డి ని కంట్రోల్ చేయడానికి వివిధ వ్యూహాలను అమలు చేస్తూనే ఉంది టిఆర్ఎస్ పార్టీ. 

 


 గతంలో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత మరోసారి అధికార టీఆర్ఎస్ పార్టీ తీరును ఎండగడుతూ తెలంగాణ రాజకీయాల్లో దూసుకుపోయారు. ఇక 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ని ఓడించడానికి ఎక్కువగా దృష్టి పెట్టిన తెలంగాణ సర్కార్.. రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలవకుండా ఓడించింది. రేవంత్ ను  ఓడించడం ద్వారా అసెంబ్లీలో తమకు  తిరుగు లేదు అని నిరూపించుకోవచ్చు అని అనుకుంది అధికార పార్టీ. కానీ మరోసారి ఎంపీగా గెలుపొందారు రేవంత్ రెడ్డి. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని కూడా చేపట్టారు.ఇంకొన్ని ఈ రోజుల్లో టీ పిసిసి చీఫ్ గా  కాంగ్రెస్ అధిష్ఠానం రేవంత్ ను నియమించపోతుంది అని వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా టిపిసిసి మార్పుకు సమయం కూడా ఆసన్నమయింది. 

 


 ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి టిపిసిసి పదవి చేపడితే టీఆర్ఎస్ పార్టీకి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి... రేవంత్ దూకుడుకు మరోసారి చెక్ పెట్టేందుకు టిఆర్ఎస్ బలమైన పన్నాగం పన్నిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి సహా రేవంత్ రెడ్డి తమ్ముడు వోల్టా  చట్టానికి వ్యతిరేకంగా భూములు కొనుగోలు చేశారని కేసులు వేశారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డికి టి పిసిసి పదవి రాబోతున్నట్లు అంచనా వేసిన అధికార పార్టీ రేవంత్ కు చెక్ పెట్టేందుకే ఇలాంటి కేసులు వేసి ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఈ కేసుల కారణంగా టిపిసిసి పదవిని రేవంత్ రెడ్డి దక్కకుండా చేయడానికైనా... లేదా ఒకవేళ రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి దక్కిన.. ఈ కేసుల పేరుతో రేవంత్ రెడ్డిని జైలుకు పంపించవచ్చు అని టిఆర్ఎస్ సర్కార్ భావిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: