భారతదేశానికి ఎక్కువగా ఉగ్రవాదుల ముప్పు ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రజాప్రతినిధులు సమావేశమయ్యే ప్రతిచోటా భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఇక దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన.. పార్లమెంటు వద్ద అయితే భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే గతంలో పార్లమెంటులోకి ఒక్కసారిగా ఉగ్రవాదులతో చొచ్చుకొని వచ్చి ఇంకొంత మంది ఉగ్రవాదులు జర్నలిస్టుల పేరుతో పార్లమెంటులోకి ప్రవేశించడంతో... ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఎంతోమంది సెక్యూరిటీ సిబ్బంది తమ ప్రాణాలను అర్పించారు. తద్వారా ఆ ఘటన నుంచి ప్రజాప్రతినిధులు అందరూ బయట పడ్డారు. 

 


 ఒకవేళ భద్రతా సిబ్బందిని దాటుకుని ఉగ్రవాదులు పార్లమెంటు లోకి ప్రవేశించి ఉంటే ఎంతో ప్రాణ నష్టం జరిగేది. ఇక ఆ ఘటన జరిగినప్పటి నుంచి పార్లమెంటు వద్ద ఎంతో పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే పార్లమెంటు వద్ద ఎంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అన్నది తాజాగా ఓ ఎంపీ  కారణంగా అందరికీ తెలిసి వచ్చింది కూడా. ఏకంగా పార్లమెంటు వద్ద హైఅలెర్ట్ భద్రతను చూసి ఒక్కసారిగా ఆ ఎంపీ వణికిపోయాడు అనే చెప్పాలి. అయితే ఉత్తరప్రదేశ్లోని కౌశాంబి ప్రాంతం బిజెపి తరఫున గెలిచిన పార్లమెంటు సభ్యుడు వినోద్ కుమార్ కి ఈ అనుభవం ఎదురైంది. 

 

 

 మామూలుగా అయితే ఎంపీ కార్ లను  సెక్యూరిటీ ఫుల్ గా స్కాన్ చేసి చెక్ చేసిన తర్వాత పార్లమెంటులోకి వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే బిజెపి ఎంపీ వినోద్ కుమార్ కి కార్  కూడా లోపలికి వస్తుంది. ఈ క్రమంలోనే పార్లమెంటు గేటు వద్ద.. డ్రైవర్ కాస్త అప్రమత్తంగా లేకపోవడంతో కారు అక్కడ సెక్యూరిటీ  కోసం ఏర్పాటు చేసిన ఒక మిషన్ కి తాకింది. దీంతో ఒక్కసారిగా సెక్యూరిటీ అలెర్ట్ అయింది.. అక్కడ ఆ సెక్యూరిటీ  మెషిన్ కి కార్  తాకడంతో కింది నుంచి ఒక్కసారిగా బాణాల్లాంటి ఇనుప కడ్డీలు  బయటకి వచ్చి కార్ టైర్లు  పగిలిపోయాయి. ఇక ముందు నుంచి అందరూ సిబ్బంది గన్స్ పట్టుకుని సిద్దంగా  పట్టుకొని అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడి సిబ్బంది మొత్తం అలెర్ట్ అయిపోయారు. పార్లమెంటు వద్ద ఉన్న భద్రతను చూసి ఆ ఎంపీ ఒక్కసారిగా వణికిపోయాడు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: