ఎక్స్ ప్రెస్  వే ఆంధ్రప్రదేశ్ లో ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా అమరావతిని రాయలసీమ ప్రాంతాలకు కనెక్ట్ చేసే  రహదారి ఎక్స్ ప్రెస్  వే. అయితే ఎక్స్ ప్రెస్  వే ను  అమరావతి దాకా కలపాల్సి ఉంటుంది. వాస్తవంగా అయితే అమరావతి నుంచి ప్రారంభమై.. ఓవైపు అనంతపురం వరకు మరోవైపు కర్నూలు వరకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ హైవే నిర్మాణం మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే చేపట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడానికి ఒప్పుకుంది.  రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం భూసేకరణ బాధ్యతను మాత్రమే చెప్పింది. 


 అయితే గతంలో వివిధ కారణాలతో ఎక్స్ ప్రెస్ వే ఆగిపోయింది. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్నర్ రింగ్ రోడ్డు సహా అవుటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని తెలిపారు. అయితే ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కడ వరకు నిర్మిస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎక్స్ ప్రెస్ వే  కేవలం చిలకలూరిపేట వరకు మాత్రమే వస్తుందని అక్కడ తో క్లోజ్ అవుతుంది అని సమాచారం.

 

 

 అయితే కేవలం చిలకలూరిపేట వరకే ఎక్స్ ప్రెస్ వే ని క్లోజ్ చేయడానికి వెనుక రెండు కారణాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ కారణాల్లో ఒకటి రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చును  బరిస్తుండటం.. రెండవది భూ సమీకరణ జరపడం. అయితే గతంలో కేంద్ర ప్రభుత్వం ఎక్స్ ప్రెస్  వే నిర్మాణం చేపడతామని ముందుకు వచ్చిన సమయంలో భూ సమీకరణ చేస్తే మూడింతల ఎక్కువ కాస్ట్ పడుతుంది అనే ఉద్దేశంతోనే భూ సమీకరణ చేయలేదు ఏపీ సర్కార్. ఇక ప్రస్తుతం కూడా అదే కారణమని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎక్స్ ప్రెస్  వే వచ్చే దారిలో భూ సమీకరణ చేయడం ప్రస్తుతం పెద్ద విషయమేమీ కాదు.. సులభంగానే భూ సమీకరణ చేయొచ్చు కానీ. ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సర్కార్ ఇలా చేస్తోందని.. అమరావతిని పూర్తిగా నిర్లక్ష్యం  చేయడంలో భాగమే ఇది అంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.మరి దీనిపై  సమాధానం చెప్పేవారు మాత్రం ఎవరూ లేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: