మహబాబూబాద్ జిల్లా కలెక్టర్ రూటే సపరేట్. ఛార్జి తీసుకుంది మొదలు.. ప్రతీ పనిలో ఆయన మార్క్ చూపిస్తున్నారు. తప్పు కనిపిస్తే చాలు, ఎలాంటి యాక్షన్ తీసుకోడానికైనా వెనకాడటం లేదు. అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

 

మహాబాబూబాద్ జిల్లా కలెక్టర్ గౌతమ్ పేరు చెబితే చాలు, ఉద్యోగులకు వణుకు పుడుతోంది. ఏజెన్సీ ఏరియా కావడంతో ఇంతకాలం ఉద్యోగులు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగింది. అయితే గౌతమ్ కలెక్టర్ గా బాధ్యతలు తీసుకోగానే, జిల్లాలో ఆకస్మిక తనిఖీలు మొదలెట్టారు. గిరిజన తండాల్లో స్కూళ్లకు వంతుల వారిగా వెళ్లే టీచర్ల తీరును మారేలా చేశారు. హాస్టల్ లో నిద్ర చేసి, అక్కడ జరుగుతున్న తప్పులను సరిదిద్దుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.  

 

గిరిజనుల పేరుతో గిరిజనేతరులు చేసిన భూ కబ్జాలపై కలెక్టర్ దృష్టి పెట్టారు. అసైన్డ్ భూములను ఆక్రమించిన వారిపై చర్యలకు దిగారు. 3వేల 500 ఎకరాల అటవీ భూమిని  ఆక్రమించిన వారి బండారం వెలుగులోకి తెచ్చారు. అందులో సూత్రధారులైన ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించి, ప్రభుత్వానికి సరెండర్ చేయాలంటూ నోటీసులు ఇచ్చి గుబులు రేపారు.  

 

ఇటీవల మానుకోట పర్యటనలో.. విధుల నిర్వాహణలో ఓ అధికారి చేసిన తప్పుకు  అక్కడికక్కడే చర్యలు తీసుకున్నారు. సదరు ఆ అధికారి డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి,  సర్వే చేయడంలో నిర్లక్ష్యం చేసాడు. విషయాన్ని తెలుసుకున్న  ఆయన, విధులను నుంచి తప్పిస్తూ సస్పెండ్ చేశారు. ఆకస్మిక తనిఖీలతో అధికారుల్లో అలజడి పుట్టిస్తున్నారు. బడి, ఆసుపత్రి, స్టేడియం ఇలా అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా త్వరత్వరగా యాక్షన్ తీసుకుంటున్నారు. గిరిజనులు, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో శ్రద్ధను చూపుతూనే,  జిల్లాలో పాలనను గాడిలో పెడుతున్నారు. మొత్తానికి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ పలువురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: