ఈ సమాజంలో ఉన్నవాడు ఇంకాస్త ధనవంతుడు అవుతుంటాడు.. లేని వాడు మరీ పేదోడవుతుంటాడు. ఎవడు ఎంత ధనవంతుడైనా ఇబ్బంది లేదు కానీ.. కిందిస్థాయిలో ఉన్నవాడికి కనీస అవసరాలైనా తీరాలి. అలా తీరనప్పుడు అది అభివృద్ధి చెందిన, నాగరిక సమాజమే కాదు. ఇప్పటికీ చాలా మందికి సొంత ఇళ్లు అనేది ఒక కల. కనీసం ఇంటి స్థలం కూడా లేని నిరుపేదలు ఎందరో.

 

 

అందుకే జగన్ సర్కారు ఈ ఉగాదికి ఏకంగా 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఉగాది పండుగ రోజు రాష్ట్రంలో 26 లక్షల మంది పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేయాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని కూడా తెలిపారు. మార్చి 25వ తేదీన ఉగాది పండుగ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే కార్యక్రమానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 43,101 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

 

 

అయితే గతంలోనూ ప్రభుత్వాలు ఇళ్ల స్థలాలు ఇచ్చాయి. ఆ సమయంలో వాళ్లకు ప్రభుత్వం కేవలం ఇంటి స్థలం వారసత్వంగా అనుభవించే హక్కు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు జగన్ సర్కారు.. ఇంటి పట్టాను గతంలో మాదిరి కేవలం వారసత్వంగా అనుభవించేందుకు మాత్రమే కాకుండా ఒక నిర్దేశిత ప్రార్మెట్‌లో ప్రభుత్వమే రిజిస్ట్రేషన్‌ చేసి లబ్ధిదారులకు అందజేయాలని భావిస్తోంది. ఇంటి స్థలం పొందిన లబ్ధిదారులు ఐదేళ్ల పాటు ఇళ్లు కట్టుకునేందుకు, లేదా వ్యక్తిగత అవసరాలకు బ్యాంకులో తనఖా పెట్టుకునే హక్కు కల్పించబోతోంది.

 

 

అంతేకాదు.. ఐదేళ్ల తరువాత దాన్ని విక్రయించేందుకు హక్కు కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్రంలో ఉన్న అందరూ తహశీల్దార్లను జాబ్‌ రిజిస్ట్రర్‌ హోదా కూడా ఇస్తున్నారు. ఈ కొత్త రూల్ ద్వారా పేదోళ్లకు ఆ ఇంటి స్థలంపై నిజమైన హక్కు లభిస్తుంది. ఇది నిజంగా పండుగలాంటిదే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి: