ఈ మధ్య టిక్ టాక్ కూడా మంచి పనులు చేస్తుంది అంటే నమ్మండి.. నిజానికి ఈ టిక్ టాక్ కారణంగా మంచి కంటే కూడా చెడు ఏ ఎక్కువ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.. ఈ టిక్ టాక్ పిచ్చితో యువతీ యువకులు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు.. ఇప్పటికే ఈ టిక్ టాక్ ఎంతోమంది ప్రాణాలను బాలి తీసుకుంది.. 

 

ఈ నేపథ్యంలోనే ఈ టిక్ టాక్ మరో ప్రాణాన్ని నిన్న బలితీసుకుంది. ఇలా మనుషుల ప్రాణాలను బలి తీసుకునే ఈ టిక్ టాక్ ఈ మధ్య మంచిపనులు చేస్తుంది.. మొన్న ఈ మధ్య తప్పి పోయిన కొడుకును టిక్ టాక్ పట్టించిన సంగతి తెలిసిందే.. అలానే ఇప్పుడు తప్పిపోయిన భామను పట్టించింది ఈ టిక్ టాక్. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. నాలుగున్నరేళ్ల కిందట తప్పిపోయిన వృద్ధురాలిని టిక్ టాక్ కుటుంబసభ్యుల చెంతకు చేర్చింది. ముత్యాలమ్మ అనే వృద్ధురాలు నాలుగున్నరేళ్ల కింద తప్పిపోయింది. 

 

అప్పట్లో ఆమె కోసం ఎన్నో చోట్లా గాలించినప్పటికీ ఆమె ఆచూకీ ఎక్కడ దొరకలేదు. కానీ టిక్ టాక్ కారణంగా ఆ భామ దొరికింది.  ఎలా అంటే? సికింద్రాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఇటీవల ఓ వ్యాపారి అన్నదానం చేశాడు.. ఆ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలను టిక్ టాక్ వీడియోలో చేశారు.

 

ఆ వీడియో చుసిన ముత్యాలమ్మ మనవరాలు రేణుక.. తప్పి పోయిన అమ్మమ్మ అక్కడ ఉన్నట్టు గుర్తించింది.. అమ్మమ్మను గుర్తుపట్టిన రేణుక వెంటనే తల్లిదండ్రులకు ఆ వీడియో చూపించింది. దీంతో కుటుంబసభ్యులు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ముత్యాలమ్మను ఇంటికి తిరిగి తెచ్చుకున్నారు. ఇలా ఆ భామ టిక్ టాక్ సాయంతో ఇంటికి చేరుకుంది. అప్పుడప్పుడు టిక్ టాక్ మంచి కూడా చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: