ఎన్నార్సీ, సీఏఏ, ఎన్‌పీఆర్.. ఈ మూడు పదాలు వింటేనే మైనారిటీలో భయంతో వణికిపోతున్నారు. వీటితో ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం ఏమీ లేకున్నా.. ఏమో భవిష్యత్తులో ఇంకేం చేస్తారో అని భయాందోళనలకు లోనవుతున్నారు. ఈ విషయంలో వైసీపీ వైఖరి మైనారిటీలకు మొదట్లో ఆందోళన కలిగించింది. కానీ ఇప్పుడు జగన్ ఈ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.

 

 

ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిసైడయ్యారు. గడిచిన మూడు మాసాల పైబడి దేశంలో ఉన్న అనేక కోట్ల మంది మైనారిటీ వర్గాల్లో నేషనల్‌ పాపులేషన్‌ రిజిస్ట్రర్‌పై భయాందోళనలో ఉన్నారు. ఏపీలో కూడా మైనారిటీ వర్గాలు భయాందోళనలో ఉన్నారు. ప్రతి పదేళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కలను ఆసరా చేసుకొని తమను డిటేషన్‌ క్యాంపులో పెడతారనే ఆందోళనలో చాలా మంది ఉన్నారు.

 

 

 

మైనారిటీల ఆందోళనను జగన్ ప్రభుత్వం అర్థం చేసుకుంది. వారికెలాంటి భయందోళన లేకుండా వారిలో భరోసా కల్పించేందుకు జగన్‌ ప్రభుత్వం 2010లో జనాభా లెక్కల ప్రక్రియలో ఏ ప్రశ్నావళి అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ ప్రక్రియకే పరిమితం కావలని నిర్ణయించింది. ఎన్‌పీఆర్‌ ప్రశ్నల నమూనాలో కూడా మార్పు చేయాలని మంత్రి మండలి తీర్మానం చేసింది.

 

 

అంతేకాదు.. ఎన్‌పీఆర్‌ ప్రక్రియను నిలిపివేయాలని కూడా మంత్రి వర్గంలో తీర్మానం చేశారు. జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఏపీలో మైనారిటీల్లో కాస్త ధైర్యం నింపింది. సీఏఏ చట్టం కేంద్రం చేసినా దాన్ని అమలు చేయాల్సింది రాష్ట్రాలే.. ఈ విషయంలో జగన్ ఇలాంటి హామీ ఇవ్వడం మైనారిటీలకు ఊరట కలిగిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: