అధికారం చేతిలో ఉన్నప్పుడు దాన్ని జనం సంక్షేమం కోసం వాడాలి. అలా కాకుండా దాన్ని స్వప్రయోజనాల కోసం వాడితే ఏమవుతుంది.. అధికారం చేతిలో ఉన్నంత కాలం ఏమీ కాదు.. కానీ అధికారం దిగిపోయాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. అధికారం చేతిలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంది.

 

 

ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్.. వాటిని తిరగదోడుతున్నాడు. ఇప్పటికే అనేక విషయాల్లో చంద్రబాబుకు జగన్ జలక్ ల మీద జలక్ లు ఇస్తున్నాడు. ఏకంగా రాజధానినే మార్చేస్తున్నాడు.. అంతకు ముందు ప్రజావేదికను కూల్చేశారు. కరకట్టపై భవనాలకు నోటీసులిచ్చారు... చంద్రబాబు కుదుర్చుకున్న అనేక కాంట్రాక్టులు రద్దు చేసేశారు.

 

 

చంద్రబాబు సర్కారు అనేక కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను తిరగదోడుతున్నారు. పీపీఏ ఒప్పందాలు సమీక్షించారు.. ఇలా ఒకటా రెండా.. ఇది రద్దుల ప్రభుత్వం అని టీడీపీ నేతలు శాపనార్థాలు పెడుతున్నా జగన్ లెక్క చేయడం లేదు. ఆ సీరీస్ లో భాగంగానే ఇప్పుడు జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

 

 

అదేంటంటే.. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గత ప్రభుత్వంలో టీడీపీ అనే రాజకీయ పార్టీకి రెండు ఎకరాల స్థలం కేటాయించింది. ఒంగోలు వంటి పట్టణంలో రెండు ఎకరాల స్థలం అంటే మాటలు కాదు. ఇది అనుచిత నిర్ణయం అని భావించిన జగన్.. ఆ రెండు ఎకరాల భూ కేటాయింపులు రద్దు చేసేశారు. ఈ మేరకు జారీ అయిన జీవోను కొనసాగిస్తూ.. ఆ భూమిని రద్దు చేసేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: