ఒక్కసారి ఉమ్మడి ఏపీకి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న రోజలు గుర్తు చేసుకోండి. తెలంగాణ విడిపోతే కరెంటే ఉండదని కిరణ్ కుమార్ రెడ్డి పదే పదే అన్నారు .. కానీ ఇప్పుడు తెలంగాణలో కరెంటు సమస్యే లేదు. ఇది ఎలా సాధ్యమైంది. విద్యుత్ అంశంలో స్వయం సమృద్ధి సాధించడం ఓవైపు.. కరెంట్ కొనుగోలు మరోవైపు.. కేసీఆర్ ద్విముఖ వ్యూహం అనుసరించారు. కరెంటు సమస్యను అధిగమించారు..

 

 

ఇప్పుడు ఏపీలో జగన్ కూడా అదే రూట్లో వెళ్తున్నారు. ఏపీని విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి కోసం ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే.. విజయవాడ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో పురోగతిలో ఉన్న 800 మెగా వాట్ల విద్యుత్‌ కేంద్రం, అలాగే కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను పూర్తి చేసేందుకు ఏపీ జెన్‌కో రూ.1000 కోట్లు రుణం తీసుకునేందుకు కేబినెట్లో ఆమోదం తెలిపారు. ఈ రుణాలకు ప్రభుత్వం నుంచి వీటికి బ్యాంకు గ్యారెంటీ ఇస్తున్నారు.

 

 

 

జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఏపీ విద్యుత్ రంగంలో కాస్త మెరుగైన పరిస్థితికి వచ్చే వీలుంది. దీర్ఘకాలంలో ఈ పెట్టుబడి సత్ఫలితాలు ఇస్తుంది. తలసరి విద్యుత్ వినియోగం పెరిగితేనే తలసరి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అందుకే జగన్ సర్కారు తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలో మరిన్ని విద్యుత్ వెలుగులకు కారణం అవుతుంది.

 

 

ఇక ఈ నిర్ణయంతో పాటు రామయ్యపోర్టు నిర్మాణం, మచిలీపట్నం, భావనపాడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. రామయ్యపోర్టుకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో, దాని అడ్డంకులు తొలగించడంలో భాగంగా కృష్ణపట్నం పోర్టుకు ఉన్న విస్తృత నిర్ణయాలకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: