ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్ల విషయంలో తగ్గించడం పై చంద్రబాబు సీఎం జగన్ పలు సూచనలు చేశారు. విషయంలోకి వెళితే 1987 లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని చంద్రబాబు నాయుడు తన లేఖలో పేర్కొన్నారు. హైకోర్ట్ ఆర్డర్ ప్రకారం జగన్ బీసీలకు ఇస్తున్న రిజర్వేషన్ తగ్గించడం అన్యాయమని అన్నారు. ఇటీవల హైకోర్ట్ తన తీర్పులో జగన్ స్థానిక సంస్థల కోసం ఇచ్చిన 59 శాత౦ రిజర్వేషన్ ని తగ్గించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

దీంతో ఇటువంటి సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును జగన్ ఎందుకు సవాల్ చేయలేదని తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబు తన లెటర్ లో 1995 నుండి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నామని గత 26 సంవత్సరాల నుండి అదే అమలు జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు 24 శాతంతో బీసీలకు అన్యాయం జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు లెటర్లో చేశారు చంద్రబాబు.

 

ఈ నేపథ్యంలో రిజర్వేషన్ అంశంపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ప్రభుత్వం తరపున దాఖలు చేయాలని జగన్ కి లెటర్ లో సూచించారు. 2019 లో బీసీ డిక్లరేషన్ తో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఇలా చేయడం అన్యాయమని జగన్ ని విమర్శించారు. హైకోర్ట్ తీర్పు పై సుప్రీం కోర్ట్ లో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేయకుండా ఇప్పుడు 24 శాతం అనడం దారుణం అన్నారు. దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు స్పందించకుండా అదేవిధంగా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయకుండా జగన్ ఉండటం పొలిటికల్ కెరియర్ లోనే అతి పెద్ద తప్పు అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: