రేవంత్ వర్సెస్ టిఆర్ఎస్ అన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ యుద్ధం జరుగుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసే విధంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కొద్ది రోజులుగా యాక్టివ్ గా ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్ అవినీతి వ్యవహారాలను గురించి ప్రస్తావిస్తూ హడావుడి చేస్తున్నారు. పిసిసి అధ్యక్ష పదవి తనకు దక్కుతుందనే ఆశతో ఉన్న రేవంత్ ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ను సమర్ధవంతంగా ఎదుర్కునే నాయకుడిని తానే అని అధిష్టానం ముందు, తెలంగాణ ప్రజల ముందు నిరూపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ విధంగా దూకుడు పెంచుతూ టీఆర్ఎస్ అగ్ర నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. 

IHG


రేవంత్ దూకుడుకు కళ్లెం వేసే విధంగా, టీఆర్ఎస్ కూడా అదే రేంజ్ లో రంగంలోకి దిగింది.  ఆయన గతంలో అక్రమంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, వాల్టా చట్టాన్ని కూడా ఉల్లఘించారని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తూ ఆయనపై ఆయన సోదరుడిపైనా వివిధ చట్టాల కింద కేసులు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో శ్రీనివాస్ రెడ్డి అనే జాయింట్ కలెక్టర్ ను కూడా ఇప్పటికే ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇక తాజాగా కేటీఆర్ ఫామ్ హౌస్ పై రేవంత్ రెడ్డి అనుచరులు డ్రోన్ కెమెరా ఎగురవేసి వీడియో తీయడం తీవ్ర కలకలం రేపింది. ఇటీవలే కాంగ్రెస్ నాయకులతో పాటు రేవంత్ రెడ్డి హైదరాబాద్ శివారులో ఉన్న ఓ ఫామ్ హౌస్ వద్ద ఆందోళన చేశారు. ఈ ఫాంహౌస్ కేటీఆర్ లీజుకి తీసుకున్నాడు. దీన్ని కేటీఆర్ కబ్జా చేసాడని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు రేవంత్ అనుచరులు సిద్ధమయ్యారు. 

IHG


తాజాగా కేటీఆర్ ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగరడం, మొత్తం ఆ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా రికార్డ్ చేయడం, ఈ వ్యవహారంలో శంషాబాద్ మాజీ జెడ్పిటిసి సహా నలుగురు కాంగ్రెస్ నాయకులు ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నట్టు తేలింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ప్రైవేటు భూముల్లో అనుమతి లేకుండా డ్రోన్ కెమెరా వినియోగించారని రేవంత్ రెడ్డి అనుచరుల పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ వర్సెస్ టిఆర్ఎస్ వ్యవహారం మరింత ముదిరేలా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: