ప్రస్తుతం ప్రపంచాన్ని ఏదైనా గజ గజ వణికిస్తోంది అంటే అది కరోనా వైరస్ ఏ.. చైనాలో వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ అత్యంత వేగంగా అన్ని దేశాలకు వ్యాపించింది. అలాంటి కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం భారత్ కూడా వణికిపోతుంది.. హైదరాబాద్ ప్రజలు ఆ వైరస్ కు బయపడి ఇంటి నుండి బయటకు రావడమే మానేశారు. 

 

అయితే ఈ కరోనా వైరస్ తగ్గాలి అంటే ముందు వాటిని ఆపాలి అని అంటున్నారు ప్రముఖులు. అసలు ఏమైంది ? ఎందుకు అనుకుంటున్నారా? మరేం లేదు అండి.. ప్రస్తుతం ఏదైనా సరే సోషల్ మీడియా ద్వారానే ప్రజలకు ఎక్కువగా తెలుస్తుంది. అలాంటి సోషల్ మీడియా ముందు కరోనా వైరస్ పై ప్రచారం ఆపితే కరోనా వైరస్ ఆగుతుంది అని అంటుంది ఓ ప్రముఖ పత్రిక. 

 

అవును.. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఎంత బాగా మంచి వ్యాపిస్తుందో చెడు కూడా అలాగే వ్యాపిస్తుంది. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మంచి కంటే కూడా చెడు ఏ ఎక్కువ వ్యాపిస్తుంది. ఎందుకంటే మీడియా కారణంగా ఎవరెవరో ఏదేదో మాట్లాడేయడం, రాసేయడం, వాటిని వినీ చదివీ ప్రజలు భయపడిపోతున్నారు. 

 

అవగాహనా కల్పించడం కంటే కూడా బయపెట్టడమే ఎక్కువ అయిపోయింది. దీని వల్ల ప్రజలకు కరోనా వైరస్ రాకముందే బీపీ, షుగర్, గుండెపోటు లాంటి రోగాలు వచ్చేలా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి ప్రమాదం రాకుండా ఉండాలి అంటే కీవర్డ్స్‌ని బ్లాక్‌ చేయాలి.. ఆలా చెయ్యడం వల్ల ప్రజలు వాటి గురించి ఎక్కువ చదవకుండా భయపడకుండా ఉంటారు. 

 

ఈ నేపథ్యంలోనే కొన్ని చాటింగ్ యాప్స్ కరోనా వైరస్ కు సంబంధించిన కీవర్డ్స్ ను బ్లాక్ చేస్తున్నాయి. అలా బ్లాక్ చేసిన మొదటి చాట్... వి చాట్‌ యాప్. వి చాట్‌ లో కరోనా వైరస్ కు సంబంధించిన కీవర్డ్స్‌ను సాఫ్ట్‌వేర్‌ సెన్సార్‌ చేసి బ్లాక్‌ చేస్తోంది. ఎందుకంటే కరోనా వైరస్ కంటే కూడా దానిపై పుకార్లే ఎక్కువ వస్తుండటం వల్ల వి చాట్‌ ఇలాంటి నిర్ణయం తీసుకుంది. మరి నెక్స్ట్ ఏ యాప్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: