కరోనా వైరస్.. ఎంత ప్రమాదకరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అత్యంత వేగంగా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకే కరోనా వైరస్ అంటేనే భయపడిపోతున్నారు ప్రజలు. ఇన్నాళ్లు చైనాను వణికించిన ఈ కరోనా వైరస్ ప్రస్తుతం భారత్ ను లోకి వచ్చి వణికించేస్తోంది. అయితే ఈ కరోనా వైరస్ గురించి మనం ఇప్పుడు బయపడుతున్నాం కానీ.. ఇద్దరు రచయతలు వారి రాతలతో గతంలోనే ప్రజలను హెచ్చరించారు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే నలభై ఏళ్ల కిందటే ఓ పుస్తకంలో కరోనా వైరస్ గురించి ప్రస్తావించారు అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చి వైరల్ అయినా సంగతి తెలిసిందే. డీన్ కూన్జ్ అనే రచయిత రాసిన ''ది ఐస్ ఆఫ్ డార్క్‌నెస్'' అనే థ్రిల్లర్ పుస్తకంలో కరోనానే అనిపించేలా కొన్ని విషయాలు రాశారు. శత్రువులపై ప్రయోగించడానికి వూహాన్‌లోని ఓ ల్యాబ్‌లో బయో ఆయుధాన్ని తయారుచేశారని ఆ పుస్తకంలో రచయిత ప్రస్తావించారు. 

 

దాన్ని వూహాన్-400గా రచయిత పుస్తకంలో రాశారు. అయితే ఇప్పుడు అలాంటి కథే మరో పుస్తకంలోను ఉంది. ఎండ్ ఆఫ్ డేస్ అనే ప్రెడిక్షన్స్ అండ్ ప్రొఫెసిస్ అనే పుస్తకంలో 2020లో న్యుమోనియా వంటి వ్యాధి ప్రపంచమంతటా వ్యాపిస్తుందని ఆ రచయత రాసి ఉంది. ప్రపంచంలో ఎలాంటి చికిత్స దీనికి ఉండదు అని.. ఆ వ్యాధికి విరుగుడు ఉండదు అని రచయత ఆ పుస్తకంలో రాసింది. 

 

 

ఆ వ్యాధి తొందరగా కనుమరుగు అవుతుంది అని కానీ మళ్లీ పదేళ్ల తరువాత ఆ వైరస్ ప్రత్యక్షమవుతుందని రచయిత సిల్వియా బ్రౌన్ ఆమె పుస్తకంలో రాశారు. పదేళ్ల తరువాత ఈ వైరస్ మరోసారి వచ్చి పూర్తిగా కనుమరుగవుతుందని ఆ పుస్తకంలో రాసి ఉంది. ఈ పుస్తకాన్ని సిల్వియా బ్రౌన్ అనే రచయత 2008లో రాశారు. 

 

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పుస్తకం గురించే చర్చ జరుగుతోంది. మరి ఆ రచయత రాసినట్టు వార్త అయితే వైరల్ అవుతుంది. అలానే కరోనా వైరస్ కూడా కనుమరుగు అవుతుందా? పూర్తిగా ఆ వైరస్ కనుమరుగవుతుందా అనేది చూడాలి. ఏది ఏమినప్పటి ఈ వైరస్ వచ్చినప్పుడు ఇలాంటి కొన్ని పుస్తకాలు బయటపడి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: