భారతదేశంలో రోజురోజుకీ కరోనా బీభత్సానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించినా బుధవారంనాటికి కొత్తగా మరికొన్ని కేసులు నమోదయ్యాయి. హైదరాబాదులో ఒక టెకీ కి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆఫీసులోని వారంతా ఆసుపత్రులకు పరుగులు తీశారు.

 

ఇక ఏపీలో తిరుపతిలో మొదట కరుణ వైరస్ వచ్చిందని అనుమానించినా చివరికి అతనికి వచ్చింది మామూలు జ్వరం అని డాక్టర్లు తేల్చారు కానీ ఆంధ్ర వాసులు ఊపిరి పీల్చుకునే సమయం కూడా ఇవ్వకుండా అనూహ్య రీతిలో సాయంత్రానికి మరో ఇద్దరు బాధితులు ఆసుపత్రిలో చేరారు. దీనికి సంబంధించి డాక్టర్ చెప్పిన విషయాలు చాలా ఆందోళన కరంగా ఉన్నాయి.

 

నిన్న ఏలూరు లోని ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరూ వ్యక్తులు కరోనా వ్యాధికి గురైనట్లు డాక్టర్లు చెబుతున్నారు. వారిలో ఒకరు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం కొండెపాడు కు చెందిన సత్తిరాజు అనే యువకుడు. అతని మామ గురుమూర్తి మూడు రోజులుగా తీవ్రమైన దగ్గు జలుబు జ్వరంతో బాధ పడుతున్నాడు. తొలుత దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లగా అసలు విషయం బయటపడింది. మొట్టమొదటి బాధితుడిగా చెప్పబడుతున్న సత్తిరాజు గత నెల 18న ఓమన్ నుండి తిరిగి వచ్చాడు. గల్ఫ్ లో ఉన్నప్పుడు కానీ లేదా విమానంలో ప్రయాణించినప్పుడు కానీ అతనికి ఈ వ్యాధి సోకి ఉండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు.

 

ఇకపోతే వారిద్దరినీ ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి రక్త పరీక్షలు చేసి తిరుపతిలోని వైరాలజీ ల్యాబ్ కు పంపారు. అయితే అసలు భయం ఏమిటంటే వీరిద్దరికీ కరుణ ఉన్నట్లు కన్ఫర్మ్ అయితే గత 20 రోజుల్లో వీరిద్దరూ చాలా ప్రదేశాల్లో తిరిగారని చెప్పడంతో ఈ వైరస్ కొన్ని వందల మందికి వ్యాపించి ఉండవచ్చని డాక్టర్లు అనుమానిస్తున్నారు. అయితే వారు తిరిగిన ప్రదేశాలు అన్నీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండడంతో ఇప్పుడు ఆ జిల్లా వాసులంతా భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి ఒక్కరి మనసులో అలజడి, అల్లకల్లోలం మొదలయ్యాయి. రానున్న రోజుల్లో ఇంకేం జరగబోతుందో తెలియదు కాబట్టి ఇప్పటి నుండే జాగ్రత్త పడటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: