ఎప్పుడైనా కరెన్సీ నోటును జాగ్రత్తగా గమనించారా.. అందులో ఓ వ్యక్తి సంతకం ఉంటుంది. ఆ సంతకం ఎవరిది.. ఈ దేశ ప్రధాన మంత్రదా.. లేక ఈ దేశ రాష్ట్రపతిదా.. కాదు.. ఆ మాత్రం మాకూ తెలుసులేవో... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ది.. ఆ మాత్రం తెలియదనుకున్నావా... అంటారా.. మీ జనరల్ నాలెడ్డ్ కు జోహార్లు.. ఈ విషయం చాలా మందికి తెలుసు.

 

 

అయితే మీకు ఇంకో విషయం తెలుసా.. మన దేశంలో తయారయ్యే ఓ కరెన్సీ నోటుపై మాత్రం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం ఉండదు. అది ఏ నోటో చెప్పుకోండి చూద్దాం.. ఈ విషయం మాత్రం చాలా మందికి తెలియదు.. మీకు తెలిస్తే మాత్రం హ్యాట్సాఫ్ చెప్పుకోవాల్సిందే.. ఇంతకీ ఆ నోటు ఏమిటంటారా..? అదే ఒక్క రూపాయి నోటు.

 

IHG

 

కావాలంటే ఎప్పుడైనా గమనించండి.. అయినా గమనించడానికి ఇప్పుడు మీకు ఒక్క రూపాయి నోటు ఎక్కడ దొరుకుతుంది లెండి. నెట్లోకి వెళ్లి... వన్ రూపీ నోట్ అని కొడితే మీకు రూపాయి నోటు బొమ్మలు వస్తాయి. అందులో కాస్త ఓపికగా గమనించండి.. సంతకం ఎవరిది ఉందో.. ఆ నోటు భారత ఆర్థిక శాఖ కార్యదర్శి సంతకం ఉంటుంది. ఆయన సంతకం ఈ ఒక్క నోటుపై మాత్రమే ఉంటుంది.

 

 

ఇంకో విషయం తెలుసా.. మిగిలిన అన్ని డినామినేషన్ల కరెన్సీ నోట్లు అంటే.. రూ. 5, రూ 10, రూ. 20, రూ 50, రూ 100, రూ. 1000, రూ. 2000 అన్ని కరెన్సీ నోట్లు రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో ముద్రణ జరిగిదే.... ఒక్క ఒక్క రూపాయి నోటు మాత్రమే భారత ప్రభుత్వం పేరుతో ముద్రితం అవుతుంది. అందుకే.. మిగిలిన అన్ని నోట్లపై bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని పెద్ద అక్షరాలతో ఉంటే.. ఈ ఒక్క రూపాయి నోటుపై మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. కావాలంటే చిత్రంలో గమనించండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: