ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ఈయన పేరుకు బీజేపీ నేతే అయినా చాలా మంది తెలుగు దేశం నేతలు ఆయనకు క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో వెంకయ్య నాయుడు కేంద్రానికీ, రాష్ట్రానికీ మధ్య సంధాన కర్తగా వ్యవహరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం అందేలా తన వంతు ప్రయత్నాలు చేశారు. ఏకంగా కేంద్ర మంత్రులను తన దగ్గరకు పిలిపించుకుని మరీ ఆయన సమీక్షలు చేసిన రోజులు ఉన్నాయి.

 

 

కానీ ఇప్పుడు ఏపీలో ఉన్నది జగన్ ప్రభుత్వం.. మరి చంద్రబాబు హాయాంలో చూపించిన చొరవ కాస్త ఇప్పుడు తగ్గినట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు వైసీపీ మంత్రులు వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు ఇప్పించాలని వైసీపీ మంత్రులు తమ లేఖలో కోరారు.

రైతులకు ధాన్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.4,724 కోట్ల బకాయిలను విడుదల చేయించాలని కోరారు.

 

 

అలాగే పోలవరం ఆర్‌ అండ్‌ ఆర్, ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పించడంలోను ప్రత్యేక చొరవ చూపించడం ద్వారా రాష్ట్రానికి సహకరించాలని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు రాష్ట్ర మంత్రులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రులు కురసాల కన్నబాబు, కొడాలి నాని, అనిల్‌ కుమార్‌ యాదవ్ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి లేఖ రాశారు.

 

 

రాష్ట్రంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలను మంత్రులు తమ లేఖలో వివరించారు. ధాన్యం కొనుగోలుపై వెంకయ్య నాయుడు రివ్యూ చేసిన విషయం తెలుసుకుని ఈ లేఖ రాస్తున్నట్లు వారు తెలిపారు. మరి ఈ లేఖ రాయడం కేవలం ఆయన సహాయం కోరడం కోసమేనా.. లేక ఇంకేమైనా రాజకీయం ఉందా అన్నది అంతుబట్టకుండా ఉంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: