ప్రపంచ దేశాలను వణికిస్తూ మరణ మృదంగం వాయిస్తూ ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ప్రాణాంతకమైన కరోనా  వైరస్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలుసిందే. అయితే ఈ వైరస్ కు  ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ కూడా లేకపోవడంతో ఈ వైరస్ మరింతగా విజృంభిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలు ఈ వైరస్ పేరెత్తితేనే వణికిపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ వైరస్ ను గుర్తించడం కాస్త సమయం తో కూడుకున్న పని లా మారిపోయింది. ప్రస్తుతం రోగుల లాలాజలాన్ని ల్యాబ్ కు  పంపించి పరీక్షించడం ద్వారా వైరస్ ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారిస్తున్నారూ. దీనికిగాను 24 గంటల నుంచి 48 గంటల సమయం పడుతోంది. 

 

 

 అయితే తాజాగా కరోనా వైరస్ సోకిందా లేదా అనే విషయాన్ని క్షణాల్లో గుర్తించడంలో లండన్లోని శాస్త్రవేత్తలు విజయం సాధించారు. న్యూ కాజల్ లోని నార్తింబియా  యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల బృందం... శ్వాస ద్వారా కరోనా  వైరస్ ను  గుర్తించే బయో మీటర్లు కనుగొన్నారు. ప్రస్తుతం మద్యం మత్తులో వాహనాలను నడిపే వారిని గుర్తించి ఎంత మొత్తంలో మద్యం సేవించారు అని పోలీసులు వాడుతున్న బ్రీత్ అనలైజర్ లాగానే... ప్రస్తుతం తాము కనుగొన్న బయో మీటర్ కూడా పనిచేస్తుంది అంటూ సూచిస్తున్నారు పరిశోధకులు. అయితే ఇందులో డిఎన్ఎ ఆర్ఎన్ఏ ప్రోటీన్లు ఫ్యాట్ మాలిక్యూల్స్ ఉంటాయని చెబుతున్నారు. 

 

 

 కేవలం కరోనా  వైరస్ గురించి మాత్రమే కాకుండా ఇతర ఊపిరితిత్తుల జబ్బులు మరియు క్యాన్సర్ మధుమేహం లాంటి జబ్బులు కూడా క్షణాల్లో గుర్తించేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగ పడుతుంది అంటూ జర్మనీ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. అయితే విమానాశ్రయాల్లో  రైల్వేస్టేషన్ లలో  బస్టాండ్ ల  వద్ద ప్రయాణికులను  తనిఖీ చేసి క్షణాల్లో వారికి కరోనా వైరస్ ఉందా లేదా అని నిర్ధారణ చేయడానికి ఈ బయో మీటర్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వెంటనే వీటికి సంబంధించిన ఉత్పత్తులను చేపట్టి.. ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నమంటూ పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: