ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది.. ఇప్పటికే ఇండియాకు చేరి భయాందోళనకు గురి చేస్తున్న ఈ కరోనా వైరస్ చైనాలోని వుహాన్ నగరంలో పుట్టింది.. ఇప్పటికే చైనాలో మూడు వేలమంది ప్రాణాలను తీసిన ఈ కరోనా వైరస్ పై సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఈ రాక్షస కరోనా వైరస్ పై టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు ఓ విచిత్ర ట్విట్ చేసి మళ్లీ తన వెర్రి ఈ రేంజ్ లో ఉందో నిరూపించుకున్నాడు. 

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరోనా వైరస్ పై నిన్న ట్విట్టర్ వేదికగా ఓ ట్వి చేశాడు.. ఆ ట్విట్ ఏ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఈ కరోనా వైరస్ పై స్పందించాడు. ఎం అని స్పందించాడు అంటే... ''మై డియర్ కరోనా.. ఏమాత్రం జ్ఞానం లేకుండా అందర్నీ చంపుకుంటూ పోతే నువ్వు చనిపోతావ్ అనే విషయాన్నీ గుర్తుపెట్టుకో... నా మాటపై నమ్మకం లేకపోతే వైరాలజీలో కోర్స్ తీసుకో. నేను చెప్పెందేమంటే.. నువ్వు బతుకు, మమ్మల్ని బతకనివ్వు. నీకు కూడా జ్ఞానం ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను'' అంటూ తన వెర్రిని అంత ఆ ట్విట్ లో చూపించాడు. 

 

అయితే ఈ కరోనా వైరస్ పై స్పందించడం రామ్ గోపాల్ వర్మ మొదటిసారి ఏమి కాదు.. మొన్న కూడా ఓసారి ట్విట్టర్ లో స్పందిస్తూ.. ''ఇంతకాలం మన దేశ ప్రజలంతా చైనా వస్తువులను బాగానే వాడాం. ఇప్పుడు ఆఖరికి చావు కూడా చైనాదే అని.. ఇది నేను అసలు ఊహించలేదు'' అంటూ సెటైర్లు వేశాడు రామ్ గోపాల్ వర్మ. 

 

అయితే ఆ ట్విట్ చుసిన నెటిజన్లు స్పందిస్తూ.. నీకు ట్విట్టర్ ఉన్నట్టు.. కరోనా వైరస్ కు ట్విట్టర్ లేదు.. హాస్పిటల్ వెళ్లి కరోనా వైరస్ ను బెదిరించుపో అని ఒకరు కామెంట్ చేస్తే.. మరికొందరు స్పందిస్తూ.. ''హా నువ్వు వార్నింగ్ ఇచ్చావ్ అని నేను గజగజ వణికిపోతా మరి.. నా దగ్గరకు రా నీకు చుక్కలు చూపిస్తా'' అని కరోనా వైరస్ అంటుంది వర్మ గారు'' అంటూ రామ్ గోపాల్ వర్మపై సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: