ఆంధ్ర రాజకీయాలు వరుస  ఐటీ సోదాలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. చంద్రబాబు అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతామంటూ ఐటి సోదాలు చేపడుతుంది అధికార పార్టీ. ఈ క్రమంలోనే మొన్నటికిమొన్న చంద్రబాబు మాజీ పర్సనల్ సెక్రటరీ శ్రీనివాస్ పై ఐటి సోదాలు నిర్వహించగా ఏకంగా రెండు వేల కోట్ల విలువైన ఆధారాలు బయట పడ్డ విషయం తెలిసిందే. అయితే ఈ ఐటీ సోదాలు ఆంధ్ర రాజకీయాలలో పెద్ద దుమారాన్నే రేపాయి. ఏకంగా టిడిపి నేతలు సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేలా చేసాయి. ఇక తాజాగా మరోసారి ఆంధ్రప్రదేశ్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. ప్రముఖ వ్యాపార వేత్త  లింగమనేని వెంచర్ కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. 

 

 

ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. అయితే ఈ ఐటీ సోదాల్లో  పలువురుని విచారిస్తున్నారు. అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో లింగమనేని వెంచర్స్ అధినేత అయిన లింగమనేని రమేష్ పై పలు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక గతంలో కరకట్టపై లింగమనేని రమేష్ అక్రమ నిర్మాణాలు చేపట్టారు అంటూ ఆరోపణలు కూడా చేసింది అధికార పార్టీ. ఇక మొన్నటికి మొన్న ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో అధికార పార్టీ చేతికి వచ్చిన లిస్టులో లింగమనేని రమేష్ పేరు కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఐటీ దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. 

 

 

 తాజాగా అధికారులు నిర్వహించిన ఐటీ దాడుల్లో  ఎలాంటి నిజాలు బయటపడ్డాయి అనేది మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బెంజ్ సర్కిల్ లోని ఎల్విపిఎల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు ఐటి అధికారులు. అయితే ఇప్పటికే అమరావతి లో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ పై సిఐడి  అధికారులు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే చంద్రబాబుకు సన్నిహితుడైన లింగమనేని రమేష్ కార్యాలయంపై దాడులు జరగడం తాజాగా మరోసారి ఆంధ్ర రాజకీయాలు చర్చనీయాంశంగా మారింది. అయితే కక్షసాధింపు చర్యల్లో భాగంగానే అధికార పార్టీ ఇలా చేస్తుందని అటు ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: