ప్రస్తుతం ప్రపంచంలో అన్ని దేశాలను కరోనా వైరస్ హ‌డ‌లెత్తిస్తోంది. ఎక్కడో చైనాలోని పుహన్ నగరంలో మొదలైన ఈ కరోనా వైరస్ క్రమక్రమంగా అన్ని దేశాలకు విస్తరిస్తూ వస్తోంది. నెల రోజులకు పైగా చైనాను గడగడలాడిస్తున్న ఈ వైర‌స్ ఇప్పుడు భారత్లో కూడా ప్రవేశించింది. మన దేశంలో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకిన‌ట్టు భారత ప్రభుత్వ గణంకాలు వెల్లడిస్తున్నాయి. ముందుగా కేరళ లో ప్రారంభమైన ఈ కరోనా వైరస్ కేసులు అక్కడి నుంచి మిగిలిన రాష్ట్రాల్లో కూడా బయట పడుతున్నాయి. ప్రతి రాష్ట్రం క‌రోనా వైర‌స్‌ అరికట్టేందుకు ప్రత్యేకంగా హాస్పిటల్స్ కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.



ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తో పోలిస్తే తెలంగాణలో క‌రోనా డేంజర్ బెల్స్ ఎక్కువగా మోగుతున్నాయి. ఇప్పటికే కరోనా అనుమానితుల కేసులు ఎక్కువ అవ్వడంతో గాంధీ హాస్పిటల్ పేషంట్ల‌తో నిండి పోతోంది. ఇందుకు ప్ర‌త్యామ్నాయంగా తెలంగాణ ప్ర‌భుత్వం ఫీవ‌ర్ హాస్ప‌ట‌ల్ లేదా మ‌రో చోట ప్ర‌త్యేకంగా క‌రోనా బాధితుల కోసం ఓ హాస్ప‌ట‌ల్ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించింది. ఇక క‌రోనా వైర‌స్ విస్తృతంగా పాకుతోన్న నేప‌థ్యంలో ఎవ‌రికి వారు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గుముఖం ప‌ట్టే వ‌ర‌కు జ‌నాలు ఎక్కువుగా ఉండే ప్రాంతాల‌కు వీలైనంత త‌క్కువుగా వెళ్ల‌డం మంచిది కాదు.



ఇక క‌రోనా వైర‌స్ భారిన ప‌డితే అది బ‌య‌ట ప‌డేందుకు 4 నుంచి 14 రోజులు ప‌డుతుంది. ఇది ఎక్కువుగా లాలాజ‌లం ద్వారా వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉండ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. ఇక ద‌గ్గు, తుమ్ము బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు చేయి అడ్డం పెట్టుకోవాలి. ఇక ప్ర‌తి ఒక్క‌రు జ‌న సంచారంలోకి వెళ్లేముందు మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ ఒక రోజు మాత్ర‌మే ధ‌రించాలి. ఏదేమైనా కొన్ని రోజుల పాటు ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు పాటించి క‌రోనాను అరిక‌ట్టాల్సిన అవ‌స‌రం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: