వివిధ దేశాల మ‌ధ్య  ప్రపంచ యుద్దాలు ఎన్నోజరిగాయి. రాజ్య కాంక్షతో సామ్రాజ్యవాదాన్ని కూడిన దోపిడీ విధానం అనేది ఈ యుద్ధాలకు ప్రాతిపదిక అయితే... మూడవ ప్రపంచ యుద్ధ ఛాయలు ఇటీవల వరకు ప్రచ్చన్న రూపంలో మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. మరీ  ఓ ప‌క్క అణుయుద్దం మెడమీద కత్తిలాగా వేలాడుతుంటే...ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిజంగానే మూడవ ప్రపంచ యుద్ధం అన్ని దేశాల పీకల మీదకు వచ్చిప‌డిన‌ట్లు ఉంది.

 

అదేమిటి మూడ‌వ ప్ర‌పంచ యుద్ధం అనుకుంటున్నారా... అదే ఆ కోవిడ్ 10 (కరోనా) రూపంలో ప్రపంచంలోని అన్ని దేశాలను చుట్టుముడుతోంది. గతంలో ఒక దేశం మరొక దేశాన్ని సర్వ నాశనం చేస్తే కరోనా మహమ్మారి అన్ని దేశాలను నాశ‌నం చేసే ప‌నిలో ఉంది. సామ్రాజ్యవాద దేశాలు, వలస దేశాలు, ధనిక పేద దేశాలని కాకుండా చుట్టుమడుతోంది. తెలుగు రాష్ట్రాలకు వస్తే తెలుగు సాహిత్యంలో కాలఙ్జానానికి పెద్ద పీటే ఉంద‌ని చెప్పాలి. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా మహమ్మారులు విజృంభించి జన క్షీణత సంభవించుతుందని సంప్రదాయ వాదులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు హేతవాదులేమో కరోనా రూపంలో మూడవ ప్రపంచ యుద్ధంలాంటిది విరుచుకు పడుతోందని భారీ ఎత్తున ఆర్థిక ఆరోగ్య విధ్వంసం సంభవించుతుందని భావిస్తున్నారు. మరీ వైద్య సేవలు అతి తక్కువ వుండే భారత దేశం లాంటి దేశాల్లో ఈ విధ్వంసం మాములు స్థాయిలో లేదు. ఎక్కువగా వుంటుందని చెబుతున్నారు. ఇక దీనికి ప‌రిష్కార మార్గాలు కూడా చాలా త‌క్కువ‌నే చెప్పాలి.

 

మరో వేపు కాల ఙ్జానానికి  విశ్వసించే సనాతన వాదులు వీర బ్రహ్మేంద్రస్వామి లాంటి వారు చెప్పినట్లు ఈశాన్యంలో ఈ పెను ప్రమాదం పుట్టుకొస్తుందని అంటే ప్ర‌పంచ ఈశాన్యంలో... (చైనా వుంది) ప్రపంచాన్ని సర్వ నాశనం చేస్తుందని కథలు కథలుగా చెబుతున్నారు. ఇవన్నీ అటుంచితే ఒక్కటి మాత్రం నిజం. చైనా ఇతర యూరోపియన్ దేశాల్లాగా భారత దేశం లాంటి దేశాలు చైనాలో లాగా కరోనా విస్తరించితే అదుపు చేసే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఇక్క‌డ జనం పిట్టలులాగా రాలి పోవలసిందే. త‌ప్పించి వైద్య సౌక‌ర్యాలు త్వ‌రగా అందుబాటులోకి రావ‌డం కాస్త క‌ష్ట‌మే అని  మ‌రి కొంత మంది వాదిస్తున్నారు. ఇక తెలంగాణలో వాస్తవంలో ఎన్ని పాజిటివ్ కేసులు వచ్చాయే ఏమో గాని రెండు రోజుల్లో వందల మంది ఆసుపత్రులకు క్యూ కట్టారు. అప్పుడే ఆంధ్ర ప్రదేశ్ లో 11 అనుమానిత కేసులు వచ్చాయి. కాని ప్రపంచాన్ని చుట్టుముడుతున్న కరోనా నిరోధం గురించి బుధవారం జరిగిన మంత్రి వర్గ సమావేశం కూలంకషంగా చర్చించ లేదు. ఆంధ్ర ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఈ మహమ్మారి విస్తరించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. దురదృష్టం కొద్దీ వ్యాపించితే అదుపు చేసే సామర్థ్యం ఏమాత్రం లేదనే అంశం గుర్తించడం లేదు. మ‌రి ప్ర‌భుత్వాలు దీని పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. ఈ మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల‌కు వ్యాపించ‌కుండా ఏం చేస్తున్నారో కాస్త ఆలోచించాల్సిన విష‌య‌మే.

మరింత సమాచారం తెలుసుకోండి: