నిజం ఆ మహిళ కండెక్టర్ కు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా ఆమె భయానికి గురై ఆస్పత్రిలో చేరాడు.. ఏంటి? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న. తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపో బస్సు మహిళా కండక్టర్‌ కు కరోనా వైరస్ లక్షణాల అనుమానంతో ఆమె పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఆసుపత్రిలో చేరారు.

 

ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతలపూడి ఆసుపత్రి వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సత్తుపల్లి నుంచి బస్సు ఏలూరు వెళ్తుండగా ఆమె అస్వస్థతకు గురవడంతో ఆమెకు కరోనా వైరస్ సోకింది ఏమో అనే అనుమానంతో ఆమె హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి అక్కడకు చేరారు. 

 

అయితే ప్రస్తుతం ఆమెలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి అని.. కానీ ఆమె రక్త నమూనా ఫలితాలు వచ్చిన తర్వాతే కరోనా వైరస్‌ ఉందా? లేదా? అనేది నిర్ధరిస్తామని వైద్యులు తెలిపారు. కాగా ప్రస్తుతం కరోనా వైరస్ హైదరాబాద్ లో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రజలు బయటకు వెళ్ళాలి అంటే భయపడుతున్నారు. 

 

అంతేకాదు ఈ వైరస్ కారణంగా హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో స్కూల్స్ మూతపడ్డాయి. పలు టెక్ కంపెనీ ఉద్యోగులకుయాజమాన్యం కరోనా వైరస్ భయంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉద్యోగులను అందరిని ఇంటి నుండే పని చెయ్యాలని ఆదేశించారు. ఇలా హైదరాబాద్ అంత కరోనా భయంతో గజగజ వణుకుతుంది. 

 

ఇది ఇలా ఉండగా.. కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించకుండా సోషల్ మీడియాలో ప్రజలను బయపెట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ బస్సు కండెక్టర్ ఎలా అయితే భయపడి ఆస్పత్రిలో చేరిందో అలానే మిగితా ప్రజలు కూడా భయపడుతున్నారు. చైనాలో వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ఇలా ప్రపంచాన్ని వణికిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: