ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా వైరస్ దీనిపేరు కొత్తగా  కొవిడ్‌-19 వైరస్‌గా మార్చేశారు. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన వైరస్ ప్రపంచంలోని 60 దేశాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది.  చైనాలో ఇప్పటికే కరోనా భారిన పడి 3 వేల మందికి పైగా మరణించారు.  85 వేల మందికి పైగా ఈ కరోనా భారిన పడి చికిత్స పొందుతున్నారు.  ఇప్పుడు బారత్ లో కూడా కరోనా ఎఫెక్ట్ తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  ఇతర దేశాల నుంచి వచ్చినవారికి కరోనా ఎఫెక్ట్ ఉందని డాక్టర్లు అంటున్నారు.  చైనాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మిగతా దేశాల్లో మాత్రం వణుకుపుట్టిస్తోంది.. ఇక, భారత్‌లో బుధవారం నాటికి 29 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం ప్రకటించింది.

 

తాజాగా ఇప్పుడు మరో సంచలన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  కరోనా వైరస్‌ ఒకటే రకం కాదట.. దీనిలో రెండు రకాలుగా ఉన్నాయని తేల్చింది ఓ పరిశోధన.. కరోనా వైరస్‌పై పెకింగ్‌, షాంఘై వర్సిటీలకు చెందిన పరిశోధకులు ఓ అధ్యయనం చేశారు.  103 కరోనా నమూనాలను సేకరించి పరిశోధనలు జరిపారు. కొవిడ్‌-19లో ఎల్‌, ఎస్‌ అనే రెండు జాతులు ఉన్నట్టుగా తేల్చారు. ఈ రెండు రకాల్లో 'ఎస్‌' రకం మొదటి నుంచీ ఉండగా.. జన్యు ఉత్పరివర్తనం కారణంగా 'ఎల్‌' రకం పుట్టుకొచ్చిందని ఆ అధ్యయనం తేల్చింది.

 

ఇక మొదటి రకం ఎస్ కంటే ‘ఎల్’ మహా ప్రమాదకరమైన వైరస్ అని అంటున్నారు.  అంతే కాదు ఇప్పటి వరకు ఎక్కువగా నమోదు అయిన కేసుల్లో ‘ఎల్’ ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  కరోనా వైరస్ పాజిటివ్‌ కేసుల్లో దాదాపు 70 శాతం.. ఎల్‌ రకం వైరస్‌ నుంచే సోకినట్టుగా చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం అది కొంత తగ్గుముఖం పట్టినా.. అంతగా ప్రమాదం లేది ఎస్ రకం వైరస్ కూడా నెమ్మదిగా వ్యాపిస్తోందని ఆ పరిశోధనలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: