బిసిల సంక్షేమంపై జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ది లేదని చంద్రబాబునాయుడు ఒకటే గోల పెట్టేస్తున్నారు. బిసిలపై నిజంగానే జగన్ కు చిత్తశుద్ది ఉంటే 24 శాతానికి మించకూడదన్న హై కోర్టు ఆదేశాలపై సుప్రింకోర్టుకు ఎందుకు వెళ్ళటం లేదు ? అంటే గట్టి లా పాయింటే అడుగుతున్నాడు చంద్రబాబు. చంద్రబాబు అడిగిన పాయింట్ విన్న తర్వాత నిజమే కదా అని అందరికీ అనిపిస్తుంది.

 

ఇదే ప్రశ్నను కాస్త చరిత్రలోకి వెళ్ళి చంద్రబాబును కూడా అడుగుదాం. చంద్రబాబు చెబుతున్నట్లుగా జగన్ కు బిసిల సంక్షేమంపై చిత్తశుద్ది లేదనే కాసేపు అనుకుందాం. మరి జగన్ కన్నా ముందు అంటే ఐదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు బిసిల రిజర్వేషన్ల శాతాన్ని 24 నుండి 34 శాతానికి ఎందుకు పెంచలేదు ?  స్ధానిక సంస్ధల ఎన్నికల్లో  బిసిలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అంటూ కోర్టులో కేసు వేసుండచ్చు కదా ? కేసు వేయవద్దని చంద్రబాబును ఎవరు ఆపారు ?

 

సరే ఆ విషయాలను అలా ఉంచితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే స్ధానిక సంస్దల ఎన్నికలు జరిగుండాల్సుంది. దాదాపు 2018 జూలై నెలలోనే స్ధానిక సంస్ధలకు ఎన్నికలు జరిపించుండాలి.  కాలపరిమితి అయిపోయిన స్ధానిక సంస్ధలకు అప్పట్లోనే  చంద్రబాబు ఎందుకు ఎన్నికలు జరపలేదు ? ఎన్నికల జరపద్దని ఎవరూ అడ్డుకోలేదే ? బిసిలకు 34 శాతం రిజర్వేషన్లతో చంద్రబాబు ఎన్నికలు జరిపించేసుంటే టిడిపినే లాభపడేది కదా ? పైగా బిసిల సంక్షేమంపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ది కూడా అందరికీ తెలిసేది కదా ?

 

తన చేతిలో ఉన్న అన్నీ అవకాశాలను వదిలేసుకున్నాడు చంద్రబాబు. పద్దతి ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని అనుకున్న జగన్ ను మరోవైపు అడ్డుకున్నాడు. తన మద్దతుదారునితో కేసు వేయించినందు వల్లే బిసిల రిజర్వేషన్ 34 నుండి 24 శాతానికి పడిపోయిందని అందరికీ తెలుసు. అయినా సరే జగన్ పై బురద చల్లేందుకే చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: