కర్ణాటక సరిహద్దులోని కోలారు సమీపంలోని హోళలి భీమలింగేశ్వర సేవాశ్రయం పీఠాధిపతి  దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్‌ రాఘవేంద్ర.. తాను దేవుడి స్వరూపమని చెప్పి గ్రామస్తులకు దగ్గరై చివరకు ఓ 18 ఏళ్ల అమ్మాయిని లేవదీసుకుపోయాడు. ఆ తర్వాత పారిపోయి తిరుపతిలో పెళ్లి చేసుకున్నాడు. స్వామీజీ చేసిన పనికి అవాక్కయిన యువతి కుటుంబసభ్యులు, గ్రామస్థులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి తప్పించుకుని తిరుగుతున్న ఆయన తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు.

 

తాజాగా  దత్తాత్రేయ అవధూత స్వామి అలియాస్‌ రాఘవేంద్ర బెదిరింపులకు పాల్పడుతున్నారు. నా పెళ్లాం, నా జోలికి వస్తే సుపారి కిల్లర్ల చేత చంపేయిస్తానని యువతి బంధువుల‌ను బెదిరిస్తున్నాడు. పెళ్లి తర్వాత నీట్ గా గడ్డం, వెంట్రుకలు కట్ చేసిన స్వామీజీ బాలీవుడ్ హీరోలాగా కొత్త‌ లుక్‌లోకి మారి.. తన భార్యతో తీసుకున్న ఫోటోలను ఆమె కుటుంబసభ్యులకు పంపించి వేధిస్తున్నాడు. నేనిప్పుడు స్వామీజీ కాదని, పెళ్లి చేసుకున్నానని మా ఇద్దరి జోలికి వస్తే ఊరుకునేది లేదని  50 లక్షలు అయినా , కోటి రూపాయలు అయినా బెంగుళూరులో ఉన్న మా కుర్రాళ్లకు చెప్పి హత్య చేయిస్తానని బెదిరించినట్లు బాధితుడు తెలిపారు. 

 

అయితే కపట స్వామిజి బెదిరింపులను అరుణ్ ఫోన్ లో రికార్డ్ చేశాడు. ఇప్పుడా వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై అరుణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగ స్వామి కోసం గాలిస్తున్నారు. ఇక కొన్ని రోజుల నుంచి ఇక్కడా అక్కడా తప్పించుకుని తిరుగుతున్న దత్తాత్రయే అవధూత స్వామీజీ, యువతి చివరికి మంగళూరు సమీపంలోని మరడేశ్వరలోని గెస్ట్ హౌస్ లో పోలీసులు చిక్కిపోయారు. మరడేశ్వరలోని గెస్ట్ హౌస్ లో పోలీసులను చూసిన వెంటనే స్వామీజీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా అది సాధ్యం కాకపోవడంతో పోలీసులు అయన్ను అదుపులోకి తీసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: